ఏపీడబ్ల్యూజేఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గాజుల చెంగల్ రాయులు, వలిగలం గోపి, ఎన్నిక

ఏపీడబ్ల్యూజేఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గాజుల చెంగల్ రాయులు, వలిగలం గోపి, ఎన్నిక

ఏపిడబ్ల్యుజెఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గాజుల చెంగల్రాయులు (గాంధీ), వళిగళం గోపి, కోశాధికారిగా కె.శ్రీనివాస్ ఎన్నిక

 తిరుపతి మార్చి 22 మాయావి న్యూస్ 

 ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపిడబ్ల్యుజెఎఫ్) తిరుపతి జిల్లా అధ్యక్షులుగా గాజుల చెంగల్రాయులు (గాంధీ) (మనం దినపత్రిక), ప్రధాన కార్యదర్శిగా వళిగళం గోపి (ప్రజాశక్తి దినపత్రిక), కోశాధికారిగా కె.శ్రీనివాస్ (మనం) ఎన్నికయ్యారు. ఉపాధ్యాక్షులుగా పి.చెంగల్రాయులు, మల్లెల వాణి, నందకుమార్, కె.రవి, డి.ధనశేఖర్, ఘట్టమనేని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎం.సురేష్ రాజ, డి.వి.రావు, పి.రాజారెడ్డి, జయకుమార్, సిఆర్ శ్రీనివాసన్, రాజారెడ్డిలను మహాసభ ఎన్నుకుంది. కార్యనిర్వాహక కార్యదర్శిగా టి.తులసీరామ్, మీడియా కోఆర్డినేటర్‌గా పి.సుధీర్, కార్యవర్గ సభ్యులుగా పి.మునిభాస్కర్ రెడ్డి, కె.హరి బాబు, గంధం చంద్రశేఖర్, కె.నాగరాజ, రాధాసురేష్, ఎ.ప్రకాష్, కె.సుధాకర్, పి.యాసిన్, జి.చంద్రశేఖర్, ఆర్.భక్తవత్సల రెడ్డి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు సీనియర్ జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఏపిడబ్ల్యుజెఫ్ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు తిరుపతిలోని రాస్ భవనంలో ఆదివారం జరిగాయి. ఈ సభల్లో జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది.