కల్తీ నెయ్యి కథ కంచికి చేరినట్లేనా..?? టిటిడి ప్రతిష్ట దెబ్బతీసిన వైసిపి దోషులపై చర్యలు ఉండవా..?.. వారం రోజుల్లో దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణ!?

కల్తీ నెయ్యి కథ కంచికి చేరినట్లేనా..?? టిటిడి ప్రతిష్ట దెబ్బతీసిన వైసిపి దోషులపై చర్యలు ఉండవా..?.. వారం రోజుల్లో దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణ!?

 కల్తీ నెయ్యి కథ కంచికి చేరినట్లేనా!!???

👉 టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసిన వైసిపి భోక్తలపై ఇక చర్యలు లేనట్టేనా..???

👉 ఏకసభ్య కమిషన్ నివేదిక ఏమి తేల్చబోతోంది..????

👉 వారం రోజుల్లో సీఎం కి రిపోర్ట్ అందజేత ...??

👉 వైయస్ జగన్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, ఏ.వీ ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ల పై తూతూ మంత్రంగా అభియోగాలు...!!?????

 కోలా లక్ష్మీపతి /ఎడిటర్ /మాయావి న్యూస్ :✍️

 శవాలు తిన్న రాబందులను..గద్దలను వదిలేసి.. గడ్డిపరకలు తిన్న పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినట్లు తయారవుతోంది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కల్తీ నెయ్యి వ్యవహారం. 

 ప్రతిష్టాత్మకమైన తిరుమల శ్రీవారి లడ్డూల ప్రసాదంలో వినియోగించిన అసలు నెయ్యే కాని కల్తీ నెయ్యిని కుంభకోణం రూపంలో కాకుండా హిందువుల మనోభావాలకు సంబంధించిన మతపరమైన అంశంగా మార్పు చేసి... ఈ అంశాన్ని నెత్తీ నోరు కొట్టుకుని.. సర్పంచ్ నుంచి మంత్రులు.. ముఖ్యమంత్రి వరకు శాసనసభలో కూడా ఇదే అంశాన్ని ప్రతి ఒక్కరూ ఎండగట్టి.. ఇక ఈ అంశంపై మాట్లాడడానికి ఏమీ లేదని అనుకునేలా కూటమి ప్రభుత్వం వైసిపి నేతలను కల్తీ నెయ్యి వ్యవహారం లో ఎండ కట్టేసింది. 

 ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కుటిల రాజకీయాలే తమకు ముఖ్యమైనట్లు కూటమి ప్రభుత్వం అటు వైసిపి నేతలు కూడా కల్తీనెయ్యి వ్యవహారంలో వ్యవహరించారు. ఒక విధంగా చెప్పాలంటే తప్పు చేసిన వైసీపీ ప్రభుత్వం కంటే అంశాన్ని దేశవ్యాప్తంగా ధార్మిక సంస్థపై ప్రచారం చేసి రాజకీయ అంశంగా మార్చేసిన కూటమి ప్రభుత్వం కారణంగానే టీటీడీ పరువు బజారున పడినట్లు అయింది. హిందువుల మనోభావాలను, మత విశ్వాసాలను దెబ్బతీసేలా. టిటిడి కేంద్రంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అడ్డం పెట్టుకుని కుట్రపన్నిందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కనుమరుగు చేసేందుకు తెలుగుదేశం పార్టీ అనుగుణమైన కూటమి నేతలందరూ కంకణం కట్టుకొని మరి రాజకీయ ప్రచారానికి కల్తీ నెయ్యి అంశాన్ని వాడుకున్నారు. 

 అయితే ఇరు పార్టీల ఉద్దేశాలు ఎలా ఉన్నప్పటికీ కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు మాత్రం కచ్చితంగా దెబ్బతిన్నాయి. కళ్ళద్దుకొని ఇంతకాలం తినిన దేవుడి ప్రసాదం జంతు అవశేషాలు కలిగిన వాటితో తయారు చేసిన కల్తీ నెయ్యితోనా..? అని గుండెలు ఆవేదనతో నిండిపోయాయి. ఏడుకొండల వాడి సన్నిధిలో ఏదో జరిగిపోయింది అని అందరూ కుమిలిపోయారు. ఇది కాస్త ఆలస్యంగా గుర్తించారో ఏమో తెలియదు కానీ స్వయంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు తన సన్నిహితుల వద్ద కల్తీ నెయ్యి వ్యవహారంపై మనం ఇంతవరకు లాగకుండా ఉంటే బాగుండేదేమో అని వాక్యానించారట...!!?? 

జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయాక ఇక పశ్చాత్తాపం పడి ప్రయోజనం ఏముంది చెప్పండి.... ఇప్పుడు ఈ కథను కంచికి చేర్చడానికే ప్రభుత్వం భావించినట్లు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకాలం కూటమి ప్రభుత్వం నేతల నోట్లో నానిన పెద్దల పేర్లు ఏవి ఏక సభ్య కమిషన్ నివేదికలో పెద్దగా కనిపించనీయకుండా.. కేవలం ఐదు లక్షలు తిన్న చిరుద్యోగి పై చర్యలు తీసుకుని భగవంతుణ్ణీ బోల్తా కొట్టించిన భోలే బాబా లాంటి బోగస్ డైరీల వ్యవహారాన్ని కల్తీ నెయ్యి కేసును కనుమరుగు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధమైనట్లు కనిపిస్తోంది. 

కల్తీ నెయ్యి కుంభకోణం పై, సిట్అధికారులు ఇచ్చిన నివేదిక పై, ఈ వారంలో నివేదికను సమర్పించ బోతున్న, ఏకసభ్య విచారణ కమిటీ!! అసలు ఏమి తేల్చిందో అర్థం కావడం. ఇప్పటికీ అసలు దొంగలు దొరకలేదు.. కొసరు దొంగలు దొరికారేమో!! చివరకు తిరుమల శ్రీవారిని కూడా వదల లేదు దుర్మార్గులు.. అలాంటి దుర్మార్గులు పట్టుబడతారా?!. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి కుంభకోణం దేశ వ్యాప్తంగా సచలనం కలిగింది.. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ లు, మాజీ బోర్డు సభ్యులు ప్రమేయం ఎంతవరకు వుందో?! లేదో!? అనే విషయం పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలు ఆధారాలు కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ నివేదికల్లో ఎక్కడా బయట పడలేదు.. వారికి తెలియకుండా, వందల కోట్లు కుంభకోణం జరిగిందా?!.. అసలు దొంగలను, కావాలని కాని, వత్తిళ్లతో కానీ, సిట్ అధికారులు వదివేసినా, తిరుమల శ్రీవారు క్షమించరు, కర్మ అనేది అసలు వదలదు.. సరైన సమయం లో, ఎవరెవ్వరి నీ, ఏయే విధంగా ఎప్పుడు తాకాలో, అప్పుడు తాకటం ఖాయం.. 

అసలు దొంగలను వదిలేయమని , సిట్ అధికారులు పై వత్తిళ్ళు తెచ్చి న రాజకీయ, అధికార పెద్దలను కూడా వెంకన్నన వదలకపోవచ్చు .. పెద్దల వత్తిళ్ళకు తలొగ్గి, వారు చెప్పినట్లుగా అసలు నిందితులు పేర్లను, సిట్ అధికారులే, నివేదికలో పొందు పరచకపోయినా, దేవుడు క్షమించినా.. కర్మ ఫలం వారిని కూడా వదలధు.. అసలు నెయ్యే లేకుండా, కల్తీ నెయ్యిని తయారు చేసి, టీటీడీ కి సరఫరా చేసిన, కంపెనీల గుట్టు బయట పడిన, నేపథ్యంలో.. సుప్రీం కోర్టు ఆదేశాలతో కల్తీ నెయ్యి కుంభకోణం పై, విచారణ జరిపిన సిట్ అధికారులిచ్చిన నివేదిక పై, చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నియమించిన ఏకసభ్య కమిషన్, విచారణ పూర్తి చేసింది.. మరో వారంలో ఆ రిపోర్టును, సీఎం చంద్రబాబు కి, స్వయం గా అందచేసే అవకాశాలున్నాయి.. 

సుమారు 60 రోజులు సిట్ నివేదిక లో అంశాలను, ఏకసభ్య కమీషనర్ రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పరిశీలించి, రిపోర్టు ను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. సిట్ నివేదిక లోని ఆంశాలపై మాత్రమే, దినేష్ కుమార్ పరిశీలించి, అందుకు బాధ్యులైన వారిలో ఎవ్వరెవ్వరి పై ఏయే చర్యలు తీసుకోవచ్చునో, ఆ విధంగా ఏకసభ్య కమిషన్ కమీషనర్ నివేదికను సమర్పించే అవకాశం వుంది.. వాస్తవానికిి గతంలో విచారణ జరిపిన సిట్ అధికారులే సరైన, నిజమైన రిపోర్టును అందచేయలేదని మీడియాలో కధనాలు వచ్చాయి..

 కల్తీ నెయ్యి కుంభకోణానికి ముఖ్య కారకులైన, అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్, పర్చేజ్ కమిటీ సభ్యులైన వైసీపీ నేతల హస్తం ఉందని, ప్రచారం జరిగినా, సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన సిట్ అధికారులు ఇచ్చిన నివేదికలో , అసలు నిందితుల పేర్లు లేవని, మీడియా ద్వారా బయటకు పొక్కింది.. సిట్ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలించి, బాధలైన వారి పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఏకసభ్య కమిషన్ కమీషనర్ దినేష్ కుమార్ సూచిస్తూ, రిపోర్టును తయారు చేసివుంటారు..

 ఆయనిచ్చే నివేదికలో, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, సభ్యులు పేర్లు ఉండకపోవచ్చు.. సిట్ అధికారు లిచ్చిన నీవేదకలో, వారి పేర్లు లేవని, గతంలోనే వెల్లడైంది.. తాజాగా దినేష్ కుమార్ , ఇవ్వబోతున్న నివేదికలో ఎవరెవ్వరి పై, ఏయే చర్యలు తీసుకోవాలో అన్న విషయం పై, ఆయన ఇవ్వబోయే నివేదకను బట్టి తెలుస్తుంది.. అందుకు కారణం, సిట్ అధికారులు ఇచ్చిన నివేదిక లో వున్న అధికారులు పై, ఏయే చర్యలు తీసుకోవచ్చునేమో మాత్రమే,సూచించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల లో వుంది.. చివరకు సిట్ ఇచ్చిన నివేదిక ఎలా ఉందంటే, కరి మింగిన వెలగ పండులా ఉందన్న విమర్శలు వచ్చాయి.. ఇక దినేష్ కుమార్ , ఇవ్వబోయే నివేదికలో ఏ విధమైన సిపార్సులు ఉంటాయో, వచ్చే వారం, ఆయన ముఖ్యమంత్రికిి అందించనున్న నివేదికలో బయట పడే వరకు వేచి చూడాల్సిందే... ఏది ఏమైనా శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్లు.. ఈ అంశాన్ని ఏకసభ్య కమిషన్ నివేదిక ద్వారా కల్తీ నెయ్యి కథను కంచికి చేర్చేలా కంకణం కట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.