చంద్రబాబు నాన్చుడు ధోరణితో నలిగిపోతున్న టిడిపి నేతలు

చంద్రబాబు నాన్చుడు ధోరణితో నలిగిపోతున్న టిడిపి నేతలు

చంద్రబాబు నాన్చుడు ధోరణితో నలిగిపోతున్న టిడిపి నేతలు 

నారా లోకేష్ కు భజన చేస్తేనే పార్టీ పదవులా!! 

 🌱 సీనియర్ల కష్టాలు అసలు పట్టించుకోరా..!?

 🌱 మారానన్న బాబు పరిపాలనపై పట్టు కోల్పోతున్నారా..?

🌱 వైసిపి వ్యవహారాలపై పార్టీలో వైఖరి కొంపముంచుతోందా..!?

🌱 తీవ్ర వ్యాఖ్యలతో టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు పై పార్టీ నేతల ముందు పళ్ళు పటపట కొరికిన వైయస్ జగన్మోహన్ రెడ్డి..!???

 కోలా లక్ష్మీపతి /ఎడిటర్ /మాయావి న్యూస్ : 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసిపి ఇష్టారాజ్య పరిపాలన కారణంగా నలిగిపోయిన అన్ని వర్గాల ప్రజలు వారిపై కోపంతో రగిలిపోయి ఆవేదనపూరితంగానే కూటమి ప్రభుత్వానికి కొలువుదీరే అవకాశాన్ని కల్పించారు. వైసీపీ చేసిన దాస్టీకాలకు ప్రతీకారాన్ని తీర్చుకోమని స్వయంగా 

 ప్రజలే తమ ఓటును వేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు.

 అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ లు చేసిన ఆర్బాటపు ప్రకటనలు ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని కలిగించగా... అధికారంలోకి కూర్చున్నాక వారు చేస్తున్న వైఖరి రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజల ఆవేదనను ఆలోచనలను పక్కన పెట్టేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 11 సీట్లు మాత్రమే సాధించిన వైసీపీ, అప్రతిహతంగా 151 సీట్లు సాధించిన కూటమి ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతుంటే అధికారాన్ని అరచేతిలో పెట్టుకుని కూడా చేతకాని అసమర్ధుల్లా వదిలేస్తున్నారు. 

 ఇదే పరిస్థితి ఇప్పుడు టిడిపిలోని సీనియర్లకు మింగుడు పడటం లేదు. వైసీపీలోని నేరాలకు పాల్పడిన నాయకులను చట్టం ముందు దోషులుగా నిలబెడతామని ఆలోచన స్వయంగా పార్టీలోని పెద్దలకే లేకపోవడం ఇబ్బందికరంగా తయారయింది. చంద్రబాబు లోకేష్ వహిస్తున్న ఈ నాన్చుడు ధోరణి కారణంగానే వైసీపీ నేతలు నుండి టిడిపి సీనియర్లు అనవసరమైన బురద వేయించుకుంటున్నారు. వారు ఇబ్బంది పడడమే కాకుండా నేరుగా పార్టీలోని పెద్దలనే టార్గెట్ చేసుకొని వైసిపి చేస్తున్న మైండ్ గేమ్ రాజకీయాన్ని కూడా ఎదుర్కోకుండా అన్నింటికీ ఒకటే మంత్రం అనేలా చంద్రబాబు పట్టించుకోకపోవడం పార్టీకి కచ్చితంగా నష్టం కలిగించి తీరుతుందని పార్టీలోని వర్గాలు వాపోతున్నారు.  

 రాష్ట్రంలోని పరిస్థితిని అటు పార్టీలోని సంకటమైన పరిస్థితిని పార్టీలోని పెద్దలు కొందరు చంద్రబాబు వద్ద ప్రస్తావించడానికి ప్రయత్నించగా.. ఆయన గతంలో కంటే కాస్త భిన్నంగా వైసిపి వాళ్ళ ట్రాప్ లో పడొద్దు... వారు ఏం చేసినా మీరు స్పందించొద్దు... అంటూ వైసిపి చేస్తున్న ఆందోళనలో కార్యక్రమాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కారులపై కూడా వారిపై ఎటువంటి కేసులు పెట్టొద్దు అంటూ స్వయంగా పోలీసులకు లోపాయికారి ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. చంద్రబాబు గతంలో కంటే ఎంతో మారానని చెప్పుకున్నప్పటికీ ఆయనే మారలేదు యధాలాపంగానే ఎన్నికలకు ముందుగా ఇచ్చిన మాటలను పక్కనపెట్టి అభివృద్ధి మంత్రాన్ని అమరావతి అంశాన్ని పట్టుకొని ఊగలాడుతూ కాలాన్ని గడిపేందుకే ప్రయత్నిస్తున్నారని పార్టీలోని విశ్లేషకులు ఏదేవా చేస్తున్నారు. 

 ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వైసిపి హయాంలో నంబర్ 2 స్థానంలో వెలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడగా ఆయనపై ఇప్పటి దాకా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడం కూటమి ప్రభుత్వ నిజాయితీని శంకించే విధంగా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్, మదనపల్లె ఫైల్స్ దహనం, కోట్లాది విలువైన అటవీ భూముల ఆక్రమణ, అధికార దుర్వినియోగం లాంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సంబంధించిన కేసులపై అనేక ఆధారాలు కూటమి ప్రభుత్వానికి లభ్యమయ్యాయి. ఆయనపై రాత్రికి రాత్రే ఏదో చర్య తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమా రేంజ్ లో పెద్ద బిల్డప్ ఇచ్చారు. హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు విచ్చేసి పెద్దిరెడ్డి ఆక్రమించిన భూములన్నింటిని ఏరియల్ సర్వే చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ లో వందల ఎకరాలు ఆక్రమించి పెద్ద ఎస్టేట్ నిర్మించారని దీనిపై పెద్దిరెడ్డికి కటకటాలు తప్పదని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండితెరపై హీరో లెవెల్ లో ప్రకటించారు. అయితే నెలలు గడుస్తున్నా నేటికీ వారి నీడను కూడా తాకలేక పోయారు. 

 మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి 42 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని ఎన్నో అక్రమ కేసులను పెట్టించుకుని పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ గా చేసిన చంద్రబాబు అటు తరువాత ఆయన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డిని ఏమాత్రం కట్టడి చేయకుండా వేడుక చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్రమాలను తన ఛానల్ ద్వారా వెలుగులోకి తెచ్చిన బిఆర్ నాయుడు పై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తాడేపల్లి లో ముఖ్య పార్టీ నేతలతో స్వయంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... పళ్ళు పటపట కొరుకుతూ మళ్లీ నేను అధికారంలోకి వచ్చేంతవరకు బి.ఆర్ నాయుడు బతికుంటే చాలు నరకం అంటే ఎలాంటిదో ఆయనకు చూపిస్తాను. అంటూ.... అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. 

 చివరకు బిఆర్ నాయుడు పై వ్యక్తిగత అంశాలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయించి ధార్మిక సంస్థ అయిన టీటీడీ పరువు ప్రతిష్టలను నడిరోడ్డులో అమ్మేస్తున్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి సంబంధించిన అనేక అవినీతి ఆక్రమాలు రుజువులు , కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ ఆయనపై ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. 

 దీనిపై కూడా బాబు వద్ద ప్రస్తావించిన పార్టీ నేతలతో వైసిపి వ్యవహారాలపై మనకు రాజకీయ ప్రయోజనం చేకూరాలి.. అంటే మనం మౌనం వహించడమే మంచిది. ప్రజలే అన్ని అర్థం చేసుకుంటారు.. అలా కాకుండా వైసిపి ప్రభుత్వం లాగే మనం కక్షపూరితంగా వ్యవహరిస్తే వారికి మనకి తేడా ఉండదు... అంటూ చంద్రబాబు హితబోధ చేసినట్లు విశ్వసినీయవర్గాల సమాచారం. వైసిపి వ్యవహారాలపై మనం స్పందించి కేసులు పెట్టినా.. వారిని అరెస్టులు చేసినా.... ప్రజల్లో సానుభూతి వారికే చేకూరుతుంది... అలాంటి పరిస్థితి పార్టీకి మంచిది కాదు మనం నీతివంతమైన రాజకీయాలనే చేయాలి అంటూ చంద్రబాబు తన వైఖరిని పార్టీ పెద్దలతో పంచుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

బాబు మారని పరిపాలన వైఖరితో ప్రభుత్వ పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు.... పార్టీలోని పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంటుందని బాబు సన్నిహిత వర్గాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో, కళ్ళున్న ధృతరాష్ట్రుని పాత్రను చంద్రబాబు పోషిస్తున్నారని, లోకేష్ అంతా తానే అన్న చందంగా, అటు ప్రభుత్వం లో, ఇటు పార్టీలో జరుగుతున్న నియామకాలు బట్టి స్పష్టమవుతోందని, అధికార వర్గాలు, పార్టీ వర్గాలే, ఆఫ్ ధి రికార్డు గా కామెంట్ లు చేస్తున్నాయి.. 

ఆ కామెంట్ లలో నిజం లేకపోలేదని, ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్ లు, పార్టీ పదవుల నియామకాలను బట్టి తెలిసిపోయింది.. అటు ప్రభుత్వం లోనే కాదు.. ఇటు పార్టీలో కూడా, తనదైన ప్రత్యేక ముద్ర ను స్పష్టంగా ఆచరణ లో చూపించారు లోకేష్ .. అటు ప్రభుత్వం లోనే కాదు.. ఇటు పార్టీలో కూడా, చంద్రబాబు పాత్ర నామ మాత్రమైందని, జరుగుతున్న ప్రచారం, తాజాగా జరిగిన పార్టీ పదవుల నియామకాలను బట్టి మరొక సారి నిజమైంది.. పార్టీలో తనకు ఎదురు లేదనీ, అంతా తన కనుసన్నులలోనే జరుగుతుందని, లోకేష్ తన ఆచరణ లో చూపించారు.. ఇక పార్టీలో చంద్రబాబు కేవలం నిమిత్త మాత్రుడు గా మిగిలిపోయారని, పెత్తనం అంతా లోకేష్ దే ననీ, ఆయన కోటరీ సభ్యులే, ధీమా వ్యక్తం చేస్తున్నారట.. 

 అటు ప్రభుత్వం లో ముఖ్యమైన పన్నులన్నీ, లోకేష్ తెలియకుండా జరగవేమో!! అదే విధంగా పార్టీలో కూడా అదే పరిస్థితి కన్పిస్తోంది.. ఇక అసలు విషయం ఏమిటంటే... తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబు ప్రభావం క్రమ, క్రమంగా తగ్గుముఖం పడుతూ, లోకేష్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, తాజాగా ప్రకటించిన టీడీపీ పదవుల నియామకాలలో, మరొక సారి లోకేష్ ముద్ర స్పష్టంగా కన్పించింది..

 పార్టీలో ఎంతో మంది కన్నా, సీనియర్ అయినా , తాను పోను చేసినా, లోకేష్ పట్టించుకోవటం లేదనీ, అసలు ఖాతరు చేయటం లేదనీ, గతంలో ఆరోపించిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ని పాలిట బ్యూరో సభ్యుడుగా నియమించటం వెనుక, ఇటీవల కాలం లో, ఆయన , లోకేష్ తో అడ్జస్ట్ అవ్వటమే ననీ పార్టీ నాయకులు చెవులు కొరుకుంటున్నారట.. పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీ లోనే వుంటూ, (ఎప్పుడూ పార్టీ మారలేదు ) చంద్రబాబు కి వీరవిధేయుడైనా, మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప ని, పాలిట్ బ్యూరో సభ్యుని పదవిలో నియమించకూడా, పార్టీలు మారిన, జ్యోతుల నెహ్రూ, నియామకం వెనుక, లోకేష్ ప్రభావం పనిచేసిందని తెలుస్తోంది.. 

 ఆయన కన్నా ఎంతో జూనియర్ అయిన పల్లా శ్రీనివాస్ రావు ని, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గా నియమించి, కిమిడి కళా వెంకట రావు ని ఉపాధ్యక్షుడు గా నియమించటం అంటే, ఆయన ను అవమానించినట్లే కధా.. 1983 లోనే కళా వెంకటరావు ఎమ్మెల్యే గా గెలిచారు రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేసారు.. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు.. కిమిడి ముందు పల్లా శ్రీనివాసరావు , చిన్న పిల్ల వాడు.. పల్లా తండ్రి సింహాచలం స్వయంగా, 1989 లో ఎమ్మెల్యే గా ఓడిపోయి, 1994 లో గెలిచారు.. అంటే పల్లా శ్రీనివాసరావు తండ్రే, కిమిడి కన్నా ఎంతో జూనియర్ అని తెలుస్తుంది.. 

 ఇలా చెప్పుకు పోతుంటే, ఇంకా చాలా నియామకాల లో కూడా, ఎన్నెన్నో చిత్రాలు, విచిత్రాలు జరిగాయి... ఆరు దపాలు ఎన్నికలలో ఎమ్మెల్యే గా విజయం సాధించి, ఒక్క సారి మాత్రమే ఎమ్మెల్యే గా ఓడిపోయిన, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ , సీనియారిటిని , గౌరవించక పోవటం లో, మర్మమేమిటి??!! చంద్రబాబు విదేయులుగా ముద్ర వున్నవారిని, లోకేష్ , కావాలనే ప్రక్కన బెట్టారని స్పష్టమవుతోంది... ఇక తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబు ప్రభావం క్రమ, క్రమంగా కనుమరుగై, యువనేత లోకేష్ ప్రభావం పూర్తిగా పనిచేయటం ఖాయం అని స్పష్టమైంది.