నాడు చంద్రబాబు.. నేడు బిఆర్ నాయుడు..
ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం టార్గెట్...✍️
నేడు నిజాయితీపరుడైన బిఆర్ నాయుడు టార్గెట్....✍️
వైసీపీ రాజకీయం వ్యక్తిత్వ హననమేనా...?✍️
కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిషన్ దృష్టి మరల్చేందుకేనా ఈ నాటకాలు...?✍️
ప్రమాదకరంగా మారిన వైసిపి కుట్రలు కుతంత్రాలు ✍️
కోలా లక్ష్మీపతి/ ఎడిటర్ / మాయావి న్యూస్ :✍️
------------------------------------------------------------
ఒకప్పుడు రాజకీయాలు చాలా హుందాగా ఉండేవి. అధికారం కోసం ఆరాటం ఉన్నా కూడా హద్దులు దాటేవారు కాదు. వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితిలోనూ ప్రస్తావించేవారు కాదు. విధానపరమైన నిర్ణయాలను వ్యతిరేకించినప్పటికీ ఎదురుపడితే ఒకరు ఒకరు ఆప్యాయతగా పలకరించుకునేవారు నాయకులు. ఇది ఏ పార్టీలలో ఉన్న నాయకులకైనా విలువలు పాటించే
రాజకీయాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తి భిన్నంగా కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, అధికారం కోసం హత్యలు, పదవుల కోసం సోషల్ మీడియాలో వీడియోల ప్రయోగాలు జరుగుతున్నాయి. అప్పట్లో అధికారం కోసం అది అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు . ఏ చిన్న వీడియో లేదా.. ఏ ఫోటో దొరికినా దాన్ని ఎడిటింగ్ చేసి, ఏఐ సాంకేతికతతో అసభ్యంగా తయారు చేసి.. సమాజంలో పెద్ద మనుషులకు సైతం బురదను చల్లేసి.. రాత్రికి రాత్రే సమాజ పరిస్థితిని భ్రష్టు పట్టించి.. పైశాచిక ఆనందాన్ని పొందే రాజకీయ కుహనా నాయకులు అడుగడుగునా కనిపిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఉన్న దుష్ట చతుష్టయం ప్రధానంగా ప్రయోగిస్తున్నది వ్యక్తిత్వం హననం. మిగిలిన ఎన్ని రకాలైన తప్పులు చేసినా చేయకపోయినా ఎంతటి పెద్ద మనుషులైనా వారికి అక్రమ సంబంధం అనైతిక చర్యల పేరుతో బురద చల్లేస్తే దాన్ని కడుక్కోడానికే చాలా కాలం పడుతుంది. ఈ లోపుగా మనం అనుకున్న టార్గెట్ పూర్తయిపోతుంది అనే ధోరణిలో వైసిపి చేస్తున్న భయంకరమైన ప్రమాదకరమైన రాజకీయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది.
వైసీపీ నాయకులు అధికారంలో కూర్చున్న గత ఐదేళ్లు ఆ పార్టీలోని మంత్రులు దగ్గర నుండి ముఖ్యమైన పెద్దలందరూ గద్దలుగానే మారారు. నోరు అదుపులో పెట్టుకోలేక ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారు. అంతటితో ఆగరా అంటే అది కాదు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారి పైన కూడా వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకున్నారు. చివరకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఆయన సతీమణి నారా భువనేశ్వరి పైన కుమారుడైన నారా లోకేష్ పైన వారి కుటుంబ బంధాన్ని శంకించేలా ఇష్టం వచ్చినట్లు మంత్రుల స్థాయిలో ఉన్న వైసిపి నాయకులు ఆరోపణలు చేశారు. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోం మంత్రిగా పనిచేసి, మరణించిన ఎలిమినేటి మాధవరెడ్డి కి, నారా కుటుంబానికి అనైతిక సంబంధాలు అంటగట్టారు. స్వయంగా అసెంబ్లీలో కూడా ద్రౌపది వస్త్రాపహరణం స్థాయిలో నారా భువనేశ్వరి పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. 45 ఏళ్ల రాజకీయ జీవితం అప్పటికే 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్నప్పటికీ నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన కుటుంబం పై పడిన ఆరోపణలు తట్టుకోలేక చిన్న పిల్లాడి లాగా వెక్కివెక్కి కంట నీరు పెట్టుకుని ఏడ్చారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా దివంగత నాయకుడు డీకే ఆదికేశవులు నాయుడు టీటీడీ చైర్మన్గా పని చేసిన తరువాత ఆయన లాగా నిజాయితీగా పనిచేసిన ఘనత ఒక్క బిఆర్ నాయుడు కే దక్కింది. వందల కోట్ల రూపాయలు అవినీతి వ్యవహారాలను ఆయన ఆస్థానంలో కూర్చున్న నాటి నుండి ఒక్కొక్కటి వెలికి తీస్తూ ఉన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన వైసిపి ప్రభుత్వం కుట్రను బహిర్గతం చేయడంలో బిఆర్ నాయుడు పాత్ర దానిద్వారా రాష్ట్ర ప్రభుత్వ ముందడుగు చరిత్రలో నిలిచిపోతుంది. ఇవే కాదు టీటీడీలో ఏ ఫైల్ ముట్టుకున్న అవినీతి కంపు కొడుతోంది అంటూ బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎంతో లోతుగా ఆలోచిస్తే టీటీడీ లాంటి ధార్మిక సంస్థను అడ్డుపెట్టుకుని వైసిపి చేసిన హిందూ వ్యతిరేక కుట్ర ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు.
కల్తీ నెయ్యి వ్యవహారం తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తిరుపతికి అడుగుపెట్టి విచారణ ప్రారంభించే సరిగ్గా 24 గంటల ముందు బి ఆర్ నాయుడు పై వ్యక్తిత్వ హననం, ఆయన ఇమేజ్ను పూర్తిగా డామేజ్ చేసే కుహనా ప్రయత్నం చేస్తూ వైసిపి నేతలు కుట్రపన్నారు. సోషల్ మీడియాలో బి ఆర్ నాయుడు ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్లుగా వీడియోలు మార్ఫింగ్ చేసి, సన్నిహితంగా ఉన్నవారు ప్రయాణానికి ముందు ఆత్మీయంగా వీడ్కోలు పలికే చిన్న విజువల్స్ ను తామేదో కొండను తవ్వి ఎలుకను పట్టామన్న ఆనందంతో వల్గారిటీ లేకున్నప్పటికీ దాన్నే చూపించే ప్రయత్నాన్ని చేస్తూ వైసిపి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో ఒక రకమైన విషాన్ని వెదజల్లే ప్రయత్నం చేశారు.
టీటీడీ చెర్మన్ బిఆర్ నాయుడు ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా లో లీకింగ్ వెనుక????!!!. ఎవరున్నారో తెలుసుకోవడం పెద్ద విషయమేమీ కాదు. అయితే దీన్ని పై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయకుండా ఎలా కట్టడి చేయాలి అన్నది ప్రభుత్వం లో ఉన్న పెద్దల వల్లే సాధ్యమవుతుంది. మరోవైపు ఈ సంఘటన ఎలాంటి ఆలోచన కలుగజేస్తున్నది అంటే...
ముఖ్యమైన పదవులులో వున్నవారు, రాజకీయ నాయుకులు, అధికారులు ఇతర రంగాల ప్రముఖులు, ఎలా ఉండాలంటే.. వారి బలం అందరికీ తెలియాలి.. కానీ వారికి ఎలాంటి బలహీనతలు వున్నా, అది వారికి మాత్రమే పరిమితం కావాలి, తెలియాలని, లేకుంటే ఎవ్వరో ఒకరు, ఏదో ఒక రోజున బంతాట ఆడుకుంటారని కొందరు ప్రముఖులు ఎప్పుడో చెప్పారు.. మనకు శత్రువులు ఎవ్వరూ లేరని అనుకుంటాం.. నిత్యం మనచుట్టూ వుండే వారితో పాటు, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయుకులు, బంధు మిత్రులు తో పాటు ఆంతరంగికులే, ఏదో ఒక రోజు మనల్ని బజారు కు లాగుతారు.. మనల్ని అన్నివిధాలుగా బ్రష్టు పట్టిస్తారు.. ఇటీవల వచ్చిన ఒక సినిమాలో, తండ్రి పాత్రదారి చేసిన కామెంట్ లలో ఎన్నో నిజాలున్నాయి.. మనకు శత్రువులు ఎక్కడో వుండరు.. నిత్యం మన చుట్టూనే తిరుగుతుంటారంటారు.. అలాగే ప్రముఖులు కు కూడా మరో విధంగా శత్రువుల రూపంలో, కొందరు ఉంటారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విషయం లో బయట పడింది.. మంచిగా ఉంటే అందరినిిి గుడ్డిగా నమ్మే నాయుడు తనకు
అలాంటి శత్రువులు ఉంటారని, నాయుడు ఎప్పుడూ అనుకోని వుండరు.. ఇప్పుడు అనుభవం తో కానీ నాయుడు కి తెలిసి రాలేదు !!
అసలు విషయానికొస్తే... టీవీ 5 చైర్మన్ గా హైదరాబాదులో వున్నప్పుడు ఒక మహిళ తో కాస్తంత చనువుగా వున్న, ఎప్పుడో 20 ఏళ్ళ నాటి ఫొటో ను, అప్పట్లో ఎవ్వరు తీసారు.. ఇప్పడు వైసీపీ సోషల్ మీడియా లో ఎలా వచ్చింది.. ఆ ఫొటోను సోషల్ మీడియా లో, వైసీపీ నాయుకులు, వైసీపీ అభిమాన మీడియా, ఆ పార్టీ అను బంధ మీడియా పదే పదే ప్రచారం చేసుండటం, వెనుక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ని, ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేసే పని గా పెట్టుకున్నారని స్పష్టమవుతోంది.... దీని వెనుక వైసీపీతిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమున కరుణాకర రెడ్డి ఉన్నారన్న అనుమానం కలుగుతోంది.. అందుకు కారణం ఏమిటంటే, టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు రాజీనామా చెయ్యాలని భూమన కరుణాకర రెడ్డి తొలి నుంచీ డిమాండు చేయటమే..
నాయుడు ఏమన్నా టీటీడీ సొత్తు భూమనలాగా బొక్కేశారా.. లేదే... టీటీడీ చైర్మన్ హోదాలో తిరుమలలో ఎలాంటి తప్పులు చేయలేదే.. అవినీతి, అక్రమాలకు పాల్పడలేదే.. గతం లో నాయుడు , ఎవరెవ్వరితో, ఏయే విధంగా, ఎంత సన్నిహితంగా ఉండారో??!! అది ఇప్పుడు అంత అవసరమా?? అది ఆయన వ్యక్తి గతం.. ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆ మహిళ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా, ఎప్పుడూ ఎలాంటి కామెంట్ లు చేయలేదు కధా.. ఎలాంటి పిర్యాదులు కూడా చేయలేదు కధా.. మరో ఒకటి ఏమిటంటే నాయుడు కూడా, ఆ మహిళతో అసభ్యంగా, అతి సన్నిహితంగా ఉన్నట్లు, సోషల్ మీడియా లో ప్రచారమైన వీడియోలో లేదు.. ఎన్ని రకాల వీడియోలును ప్రచారం చేసినా, నాయుడు ఎక్కడా, అసభ్యంగా ప్రవర్తించినట్లుగా ఎక్కడా కన్పించలేదు.. వైసీపీ నేతలు కూడా ఇంతగా దిగజారి, అలాంటి వీడియోలను ప్రచారం చేయటం ను చూస్తుంటే, ఇదంతా ఒక పధకం ప్రకారం జరిగిందన్నది వాస్తవం..
ఇంతకూ అలాంటి ఫొటోలు ఎప్పుడు, ఎవరెవ్వరు తీసారో!! ఆ ఫొటోలను ముచ్చటపడి ఎవ్వరైనా దాచుకున్నారా??!! ఇప్పడు వైసీపీ నాయకులకు ఎవ్వరు ఇచ్చారు.. వారికి ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఎలా దొరికాయి?? పూర్తి విచారణ జరిపితే, తెరవెనుక సూత్రధారుల దొంగలు.. తెర ముందు పాత్రధారుల దొంగల గట్టు రట్టుఅవ్వటం ఖాయం.. ఎక్కడో.. ఏదేదో జరిగింది.. నాయుడు ఎలా దొరుకుతారా??!! అని గుంట నక్కలలాగా కొందరు తొంగి, తొంగి చూచారు.. ఈ విధంగా నాయుడు ఫొటోలు, వీడియోలు దొరికాయి.. సోషల్ మీడియా లో హడావుడి చేసారు..
మరో విషయం గమనిస్తే.. వైసిపి ప్రభుత్వ హయాంలో టిటిడి చైర్మన్ లుగా కొలువులు వెలగబెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లు పథకం ప్రకారం దోచేసిన అక్రమాలు అవినీతి వ్యవహారాలను బయటకు తీసుకురావద్దంటూ స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు ను ప్రాధేయపడుతూ ఆయనను కలిసేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. నాయుడు అలాంటి అవకాశం ఇవ్వలేదు. పైగా ముక్కు సూటిగా వ్యవహరిస్తూ భక్తుల సౌకర్యాలను తప్ప ఇతరత్రా తప్పులను క్షమించకుండా ఒక్కొక్కటి కుంభకోణాలను వెలికితీస్తూ వచ్చారు. చివరకు ఇది ఎంతలా అంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బిఆర్ నాయుడుతో కలుగజేసుకుని ఇలా మీరు వరుసగా టిటిడి లోని వైసిపి అవినీతి కుంభకోణాలను బయటపెడుతుంటే భక్తుల మనోభావాలు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంది. మనం వైసిపి తప్పులను బయటపెట్టే క్రమంలో టీటీడీపై ఈ రకమైన అభిప్రాయం ఏర్పడడం కరెక్ట్ కాదు అంటూ బి. ఆర్ నాయుడు ని చంద్రబాబు సముదాయించే వరకు వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.