భక్తులకు నోరూరిస్తున్న వెంకన్న లడ్డూలు.. పెరిగిన లడ్డు ప్రసాదాల విక్రయాలు. భక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన బిఆర్ నాయుడు.

భక్తులకు నోరూరిస్తున్న వెంకన్న లడ్డూలు.. పెరిగిన లడ్డు ప్రసాదాల విక్రయాలు. భక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన బిఆర్ నాయుడు.

భక్తులకు నోరూరిస్తున్న వెంకన్న లడ్డూలు

భారీగా పెరిగిన తిరుమల లడ్డూల విక్రయాలు 

 తిరుమాడ వీధులలో ఘుమఘుమలాడుతున్న నెయ్యి పరిమళం 

 రాజీలేని నాణ్యతతో నిలబడిన ప్రసాదాల ప్రాశస్త్యం 

 భక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన బి.ఆర్ నాయుడు 

 

  తిరుమల, మే 4 మాయావి ప్రతినిధి:✍️  

 ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న తరువాత అంతటి ప్రాశస్త్యం కలిగిన లడ్డు ప్రసాదం నాణ్యతలో కల్తీ నెయ్యి వివాదాలు తొలగిపోయి మళ్లీ స్వచ్ఛమైన నేతి సువాసనలతో ఘమఘమలాడుతున్నాయి. ఇప్పుడు తిరుమల వీధులలో ఎక్కడ అడుగుపెట్టినా నేతి సువాసనలు పరిమళభరితంగా భక్తుల ముక్కుపుటాలు అదరగొడుతున్నాయి. 2019 ఏడాదికి ముందు వరకు ఇదే విధమైన కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యితో భక్తుల ఆదరణ చూరగొన్న లడ్డు ప్రసాదం నాటి తరువాత వైసిపి పాలనలో అసలు నెయ్యే కాని రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడి, పేటెంట్ హక్కు సాధించిన లడ్డు ప్రసాదాన్ని నాణ్యత కోల్పోయిన భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. 

 2024 వరకు వైసిపి పాలనలో టీటీడీ ధార్మిక సంస్థ పరువు బజారున పడవేయడమే కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా అంతకంటే మించి భక్తుల నమ్మకాన్ని కోల్పోయేలా కల్తీ నెయ్యి కుంభకోణంలో కూరుకుపోయి... లడ్డు ప్రసాదాలను కనీసం వాసన లేని క్రికెట్ బంతుల్లాగా గట్టిగా తయారు చేశారు. ఎవరు ఊహించని విధంగా రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యి వాటిని సరఫరా చేసేందుకు బోగస్ డైరీలను సృష్టించి వేల కోట్ల రూపాయల భక్తుల కానుకలను దిగమింగిన అప్పటి పాలకుల చారిత్రాత్మకతప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బి.ఆర్ నాయుడు నేతృత్వంలోని పాలకమండలి చేపట్టింది. కల్తీ నెయ్యి కుంభకోణాన్ని వెలికి తీసి దోషులను శిక్షించే వ్యవహారాన్ని ప్రభుత్వానికి అప్పగించిన టిటిడి పాలకమండలి... మరోవైపు కోట్లాదిమంది భక్తులలో లడ్డు ప్రసాదాలపై ఉన్న నమ్మకాన్ని భక్తి పరవశ్యాన్ని నిలబెట్టే విధంగా స్వచ్ఛమైన నెయ్యిని టీటీడీకి తెప్పించే విధంగా గట్టి చర్యలు తీసుకున్నారు. దీంతో లడ్డులకున్న ప్రాశస్త్యాన్ని కాపాడడమే కాకుండా భక్తులలో స్వామి వారి ప్రసాదమైన లడ్డూలను వాటిపై ఉన్న భక్తుల నమ్మకాన్ని సంపూర్తిగా ఈ రెండేళ్లలోనే నిలబెట్టుకోగలిగారు. ఈ కారణంగానే ఇప్పుడు శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యత పూర్వం లాగే యధా స్థానానికి చేరుకొని లడ్డూల విక్రయాలు కూడా అనూహ్యంగా పెరిగాయి. 

 తిరుమలకు విచ్చేసిన భక్తులు సంతృప్తిగా ఇప్పుడు ఎవరు అడిగినా లడ్డు ప్రసాదాల నాణ్యత చాలా బాగుందంటూ... చేతికి తీసుకున్న లడ్డూలను సంతృప్తిగా తినేద్దామనే జిహ్వ చాఫల్యం కలుగుతోందని ఎన్నో ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితిని చూస్తున్నామని.... ఆ లడ్డూలను భక్తి పారవశ్యం తో కళ్లద్దుకొని మరి చెబుతున్నారు. టీటీడీ పాలకమండలి సమర్థవంతమైన పనితీరుకు భక్తుల్లో వినిపిస్తున్న సంతృప్తికరమైన మాటలకంటే.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి...!?

పవిత్రమైన శ్రీవారి లడ్డూలను ఈ ఏడాది భక్తులు మొత్తం 13,95,43,231 లడ్డూలను కొనుగోలు చేశారు. ఇది ఇప్పటివరకు నమోదైన రికార్డు కాగా, మొత్తం ఉత్పత్తి 13,94,75,055 లడ్డూలు. నిరంతర పర్యవేక్షణ, నమూనాల సేకరణ, నాణ్యమైన పదార్థాల కొనుగోలు కోసం కొత్త ప్రయోగశాలల ఏర్పాటు, అదనంగా 74 మంది కార్మికుల నియామకం, పోటు కార్మికులు చెల్లించాల్సిన జీఎస్టీ పన్నును సంస్థ చెల్లిస్తూ వారికి అదనంగా రెండున్నర వేల రూపాయలు ప్రయోజనం చేకూరే లాగా నిర్ణయం తీసుకున్న 

ట్రస్ట్ బోర్డు ఇటీవల మంజూరు చేసిన ప్రోత్సాహకాలు వంటి అంశాలు లడ్డూల అమ్మకాలు, ఉత్పత్తిలో ఈ వేగవంతమైన వృద్ధికి దోహదపడ్డాయి. 2024 సంవత్సరంతో పోల్చినప్పుడు, అమ్మకాలు 12,18,53,535 కాగా, ఉత్పత్తి 12,19,89,405 లడ్డూలుగా నమోదైంది.

 తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల..

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, అమ్మకాల వృద్ధి ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతోంది. నాణ్యత యధా స్థానానికి చేరుకోవడం ఫలితంగా లడ్డూలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ నెల 2026 నాటికి అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత నెల ఏప్రిల్ 14వ తేదీన ఒకేరోజు 8.36 లక్షల లడ్డూలను స్టాక్ ఉంచుకున్నారు. రథసప్తమి వైకుంఠ ఏకాదశి ఇలాంటి పర్వదినాలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయం ఒకేరోజు నాలుగున్నర లక్షలకు పైగా నమోదయింది. 2025 డిసెంబర్ 27వ తేదీన ఒకేరోజు 5.13 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించిన టిటిడి రికార్డు స్థాయిలో విక్రయం జరిగింది.

ప్రస్తుతం పోటు (దేవాలయ వంటగది)లో మొత్తం 700 మంది కార్మికులు షిఫ్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిలో 489 మంది పోటు కార్మికులు శ్రీ వైష్ణవులు కాగా, మిగిలిన 211 మంది వైష్ణవేతర సహాయకులు. నవంబర్ నెలలో ప్రస్తుత ట్రస్ట్ బోర్డులో అదనంగా 84 మంది కార్మికులు చేరారు. భక్తుల డిమాండ్ కు అనుగుణంగా లడ్డు ప్రసాదాల ఉత్పత్తి భారీగా పెరిగింది. వీరితోపాటు అదనంగా పోటు కార్మికులను శాశ్వత ప్రాతిపదికలో నియమించడానికి ప్రస్తుత కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి సమిష్టి కృషిగా ప్రభుత్వానికి ఒక నివేదిక ద్వారా నియామకాలు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

 ప్రస్తుతం, జనవరిలో అమ్మకాలు 1,26,77,250 కాగా, ఉత్పత్తి 1,26,88,800గా ఉంది. ఫిబ్రవరి నెలలో ఉత్పత్తి 1,000,0006,79,400 కాగా, అమ్మకాలు 1,07,23,459గా ఉన్నాయి. మార్చి నెలలో ఉత్పత్తి 1,13,78,100 కాగా, అమ్మకాలు 1,13,94,475గా ఉన్నాయి.

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తుల డిమాండ్‌ మేరకు లడ్డు ప్రసాదాలను అందించడానికి అధికారులను సిద్ధంగా ఉంచాము. ఈ రెండేళ్లలో లడ్డు ప్రసాదాల నాణ్యతను పెంచడంతో పాటు భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రసాదాలకున్న ప్రాశస్త్యాన్ని కాపాడడమే కాకుండా ధార్మిక సంస్థ ప్రతిష్టను నిలబెట్టుకున్నాం. రోజురోజుకీ భక్తుల్లో పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా గతంలో రోజుకి 3.75 లక్షల లడ్డూలను తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు గత ఆరు మాసాలుగా ఈ లడ్డూల ఉత్పత్తి సంఖ్య రోజుకు 4.50 లక్షలకు తయారుచేసేలా చేరుకున్నాం. అంటూ టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు( బి ఆర్ నాయుడు ) వెల్లడించారు.