తిరుమల కొండపై ఇక కొత్త నిర్మాణాలు నిషేధం. అలిపిరిలో 25 వేల మంది భక్తులకు 500 కోట్లతో భారీ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ వసతి సముదాయాలు
*తిరుమల కొండపై ఇక కొత్త కట్టడాలు నిషేధం*
*క్యూ కాంప్లెక్స్, పరిపాలన భవనం లాంటి నిర్మాణాలకు బ్రేక్*
*ఏఐ సహకారంతో భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం*
*ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా భక్తులను తిరుమలకు తరలింపు...*
*కొండపై ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం*
*అలిపిరి వద్ద 25 వేల మంది భక్తులకు 500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ నిర్మాణం వేగవంతం*
*అలిపిరి టోల్ గేట్ సముదాయం ఆధునీకరణ*
*తిరుమల, మే 30, మాయావి, ప్రత్యేక కథనం:* ✍️
👉 *తిరుమల కొండపై తరతరాల నుండి ఏర్పడిన సహజమైన చల్లటి వాతావరణం కనుమరుగవుతోంది. దీన్ని మళ్లీ 30 ఏళ్ల ముందు ఉన్నటువంటి వాతావరణానికి సమానంగా తీసుకురావాలి. సౌకర్యాల పేరుతో భారీ కట్టడాలు తిరుమలపై విపరీతంగా పెరిగాయి. ఈ కారణంగా సహజత్వం దెబ్బతింటోంది. నేను స్పష్టంగా చెబుతున్నా.. ఇకపై తిరుమలలో ఒక్క ఇటుక కూడా పెట్టకూడదు.. అంటే ఎటువంటి కట్టడాలు నూతన నిర్మాణాలు కొండపై చేపట్టవద్దు.. శ్రీవారి దర్శనానికి భక్తులు రోజుల తరబడి వేచి ఉండే విధానానికి స్వస్తి పలకాలి... ఏఐ విధానంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, భక్తులు వేచి ఉండే పరిస్థితి లేకుండా... క్యూ కాంప్లెక్స్ ల అవసరం లేకుండా... అందరికీ భగవంతుడి దర్శనం ప్రశాంతంగా లభించాలి.. ఇందుకోసం భవిష్యత్తు ప్రణాళిక స్పష్టంగా ఉండాలి.. కొండపై వాతావరణం వాయు కాలుష్యం లేకుండా పూర్తిగా పొల్యూషన్ ఫ్రీ ఉండేలా బ్యాటరీ ఎలక్ట్రికల్ వాహనాల ప్రయాణాన్ని తీసుకొని రావాలి.. కొండపై భక్తులకు కావలసిన సదుపాయాలన్నింటిని తిరుపతిలోనే ఏర్పాటు చేయాలి కేవలం స్వామివారి దర్శనానికి మాత్రమే తిరుమలకు భక్తులు చేరుకునేలా ప్రణాళిక రూపొందించండి.. ఈ స్పష్టమైన ఆదేశాలు ఎవరివో కాదు.. తిరుమల తిరుపతి పై సంపూర్ణమైన అవగాహన కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఉన్నతాధికారులతో చెప్పిన మౌఖిక ఆదేశాలు.*
👉 తాజాగా ముఖ్యమంత్రి చేసిన ఈ ఆదేశాలతో టిటిడి యంత్రాంగం ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనతో పాటు వేగవంతంగా మౌలిక సదుపాయాల కల్పన భారీ వసతి ఏర్పాట్లు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం టీటీడీ సంస్థలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీలో అన్నదానంలో చేపట్టిన సంస్కరణలు,.. శ్రీవారి ప్రసాదంలో తీసుకొచ్చిన నాణ్యత పరిస్థితులు... తరహాలో తిరుమల కొండపై స్వామివారి దర్శనం శ్రీవారి భక్తులకు ఎటువంటి వెయిటింగ్ లేకుండా ఎలా కల్పించగలమో అని యోచిస్తున్నారు. ఇందుకోసం ఏఐ విధానాన్ని ఎలా వినియోగించుకోవాలని పరిస్థితులను అధ్యాయం చేస్తున్నారు. ఇప్పటికే టీటీడీలో ఉన్న కమాండ్ కంట్రోలింగ్ విధానం ద్వారా అధికారులు కార్యాలయంలో నుంచి కాలు కదపకుండా పరిస్థితిని తెలుసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని అంచనా వేశారు.
ఏ ఐ విధానాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి కంపార్ట్మెంట్లలో భక్తులు రోజులు తరబడి కూర్చునే పరిస్థితి లేకుండా,, కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లలో పడిగాపులు పడే అవసరం లేకుండా.. ఖచ్చితంగా క్యూ లైన్ లోకి ప్రవేశించిన తరువాత రెండు మూడు గంటల్లోగా శ్రీవారి దర్శనం పూర్తి చేసుకునేలాగా భక్తులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అనే దిశగా అధ్యయనాన్ని మొదలుపెట్టారు.
🌱 తిరుమల కొండపై ప్రస్తుతం 68.90 శాతం మాత్రమే ఉన్న అటవీ పచ్చదనం ఉంది. కానీ ఇటీవల ప్రభుత్వానికి దీన్ని 89. 2 శాతంగా ఉన్నట్టు ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని మభ్యపెట్టారు. అయితే ఇకపై ఈ సహజత్వాన్ని కాపాడేందుకు ఇకపై ఎటువంటి వృక్షాలను నేలకూల్చకుండా మొక్కలను వీలైనంతవరకు పెంచే కార్యక్రమాన్ని చేపడతారు. తిరుమలలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు భక్తులందరికీ తెలిసేలా ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేస్తారు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లలో విపరీతమైన పొగను కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలను పూర్తిగా నిషేధించాలనే యోచన చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతిలో మధ్య 4000 ట్యాక్సీలు అద్దెకు తిరుగుతున్నాయి. వీటితో పాటు రోజుకు మొత్తం 15వేల వాహనాలు తిరుమలకు చేరుకుంటున్నాయి. అయితే కొండపై ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కేవలం 6,800 వాహనాలకు మాత్రమే పార్కింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా ప్రతినిత్యం కొండపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేసుకుంటున్నారు.
🌱 ఈ పరిస్థితిని పూర్తిగా మార్చడానికి టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించింది. తిరుపతిలో భక్తుల కోసం నిర్మించదలచిన ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ మల్టీ స్టోర్ భవనాలు ప్రదేశంలో నుండి నేరుగా తిరుమలకు తిరుపతికి 100 ఎలక్ట్రికల్ బస్సులను ఉచితంగా ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
ఈ ఎలక్ట్రికల్ బ్యాటరీ ద్వారా నడిచే పొల్యూషన్ ఫ్రీ వాహనాలను టీటీడీకి విరాళంగా ఇచ్చేందుకు ఇప్పటికే తయారీ సంస్థ ముందుకు వచ్చింది. ఒక్కో బస్సు 1•23 కోట్లు ఖర్చు అవుతుందని అంటే దాదాపు 150 కోట్ల రూపాయల మేరకు ఖర్చు అయ్యే వంద బస్సులను టీటీడీకి విరాళంగా ఇచ్చి వాటి నిర్వహణ బాధ్యతలను కూడా చూసేందుకు దాతలు టీటీడీకి ఇప్పటికే అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రయత్నం కనుక విజయవంతం అయితే ప్రతిరోజు తిరుమల కి వెళుతున్న నాలుగువేల టాక్సీలను నిషేధించనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు గా భక్తులు తీసుకొచ్చే కార్లు కూడా అనుమతించకుండా తిరుపతిలోనే పార్కింగ్ చేసుకుని కేవలం ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా మాత్రమే భక్తులందరూ తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు.
🌱 అలాగే ఇప్పుడున్న అలిపిరి టోల్ గేట్ సముదాయం ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరించి ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా పూర్తిస్థాయిలో భక్తులకు భక్తి భావం కలిగించేలా సరికొత్త రూపకల్పనతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నూతన టోల్గేట్ సముదాయాన్ని భారీ ఎత్తున ఆధునీకరించాలని టీటీడీ పాలక మండలి భావిస్తోంది. ఇందులో భాగంగా టోటల్ స్కానింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాహనంతో పాటు అందులో ప్రయాణించే భక్తులను కూడా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా స్కానింగ్ చేసే విధానం నూతన యంత్రాలను టోల్గేట్ లో ఏర్పాటు చేస్తారు.
🌱 వీటన్నింటికీ అనుసంధానమైన తిరుమల కొండపై పరిమితంగా ఉన్న స్థలంలో భక్తులకు అపరిమితమైన సౌకర్యాలను కల్పించే పరిస్థితి లేకుండా చూస్తూ కేవలం శ్రీవారి దర్శనం కోసం మాత్రమే కొండపైన వచ్చేలా భక్తులకు తిరుపతిలోని అలిపిరి ప్రాంతంలో ఆ రెండు ప్రాంతాలలో ఉన్న 25 ఎకరాలను పక్కనే ఉన్న 42 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ మల్టీ భవనాల సముదాయాలకు ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో తిరుమలకు వచ్చే భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలను అంటే శ్రీవారి దర్శనం టోకెన్లు భారీ మల్టీ స్టోర్ పార్కింగ్, బస చేసేందుకు స్మార్ట్ గదుల నిర్మాణం, వసతి సదుపాయాలు, సామాన్య భక్తులకు లాకర్లు స్నానపు గదులు వినోదానికి కావలసిన ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాట్లు భక్తులు ఊహించని విధంగా అన్ని సౌకర్యాలను అందుబాటులోకి ఒకే చోట ఉండేలా ప్లాన్ చేశారు.
🌱 ఈ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ మల్టీస్తోర్డ్ భవనాల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో రవిచంద్ర లో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేటాయించే సమయాన్నిబట్టి నెలరోజుల్లోపుగా ఈ భవనానికి శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే ముఖ్యమంత్రి ఆలోచనల లో ఉన్న ఈ భవనాల నిర్మాణ ఖర్చు కూడా తొలుత 125 కోట్లు అని ప్రాథమికంగా అంచనా వేయగా ప్రస్తుతం ఈ వీటిని నిర్మాణ ఖర్చు 500 కోట్ల నుంచి 650 కోట్ల వరకు కావచ్చని అంచనాలు విపరీతంగా పెరిగాయి.