వెంకన్న ఉత్పత్తుల పేరుతో వైసిపి నేతల వ్యాపారం.. అగర్బత్తుల తయారీలో అంతా అక్రమాలే విజిలెన్స్ నివేదిక.. అక్రమాలకు చెక్ పెట్టిన టిటిడి పాలక మండలి..
వెంకన్న ఉత్పత్తుల పేరుతో వైసిపి నేతల వ్యాపారం
👉 అగరవత్తుల తయారీ పేరుతో అంతులేని దోపిడి
👉 వాడిపోయిన పుష్పాలలో రసాయనాలు కలుపుతున్నట్లు విజిలెన్స్ నివేదిక
👉 అమ్మకాలు, తయారీ నుంచి 3 ఉత్పత్తులను ఉపసంహరించుకున్న టీటీడీ
👉 దర్శన్ సంస్థ ఒప్పందాన్ని రద్దుచేసి టెండర్ల ద్వారా జాతీయ సంస్థలకు అప్పగించాలని టిటిడి నిర్ణయం
కోలా లక్ష్మీపతి /ఎడిటర్/ మాయావి న్యూస్:✍️
గత ఏడేళ్లుగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పేరుతో అగరబత్తీల తయారీ కేంద్రాన్ని దర్శన్ సంస్థ పేరుతో నడుపుతూ.. దేవుడు సొత్తు అక్రమంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ లక్షల్లో మాత్రమే ఆదాయం చూపిస్తూ... టిటిడి సొమ్ము దిగమింగుతున్న వైసిపి నేతల పాపం ఇంత కాలానికి పండింది. ఎస్పీ డైరీ ఫామ్ లో నడుపుతున్న అగర్బత్తి తయారీ కేంద్రం పేరుకు దర్శన్ సంస్థ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ తెర వెనుక వైసీపీ నేత చెవిరెడ్డి తనయుడు అంతా చక్రం తిప్పుతున్నట్లు.. పైగా టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి.. అగర్బత్తీలను రసాయనాలు కలుపుతూ.. సంస్థను మోసం చేస్తున్నట్లు ఎట్టకేలకు విజిలెన్స్ నివేదిక బయటపెట్టింది. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు అగర్బత్తి తయారీ కోసం పనిచేస్తున్న వందల మంది కార్మికులు కూడా అందరూ చెవిరెడ్డికి స్వగ్రామం చెందిన అనుచరులు వారి బంధువులే అన్న వాస్తవం బయటపడింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులందరూ గతకొన్నేళ్లుగా సుపరిచితమైన అగరుబత్తులు టీటీడీ నుంచి కొనుగోలు చేస్తున్నారు. టిటిడి పబ్లికేషన్ స్టాల్స్ ద్వారా విక్రయిస్తున్న ఈ అగర్బత్తులను తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు జిల్లాలోని స్థానిక ఆలయాలలో కూడా ఉత్సవ విగ్రహాలకు అలంకరించిన పూల మాలలు వాడిన తర్వాత వాడిపోయిన పుష్పాలను అలాగే తరలించి వాటిని వృధా కానివ్వకుండా పొడిపొడిగా చేసి వాటి నుండి అగరబత్తీలను తయారు చేసి, తిరిగి భక్తులు కొనుగోలు చేసి భగవంతుడు సేవకే వినియోగించేలాగా ఒక మంచి కార్యక్రమానికి టిటిడి కొన్నేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది.
ఈ అగర్బత్తీల తయారీ కేంద్రాన్ని తిరుపతిలోని ఎస్వీ డైరీ ఫామ్ లో విశాలమైన స్థలంలో ప్రారంభించారు. గత వైసిపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డి ఆలోచనల ప్రకారం రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు బినామీగా వ్యవహరించిన ఏవి ధర్మారెడ్డి కోట్ల రూపాయల టీటీడీ నిధులను కేటాయించి ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన దర్శన్ అనే సంస్థకు ఎటువంటి టెండర్లు లేకుండా కట్టబెట్టారు. కొన్నేళ్లపాటు ఈ అగర్బత్తులను తయారు చేసి అందుకు సంబంధించిన మెలకువలు శిక్షణ కూడా టీటీడీ సిబ్బందికి ఇచ్చేలాగా ఎంఓయూ కుదుర్చుకున్నారు.
అయితే టీటీడీ నుంచి ఈ అగర్వాల్ తయారీ కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తూ ఆ నిధులను పొందిన దర్శనం సంస్థ ఆ స్థాయిలో అగరుబత్తీలను తయారు చేయలేక అరకొరగా తయారు చేస్తూ అందులో కూడా నిబంధనలకు విరుద్ధంగా కొన్నింటిలో రసాయనాలు కలుపుతూ టీటీడీ నిబంధనలను ఉల్లంఘించింది. కేవలం స్వామి వారి పుష్పాలతోనే తయారు చేస్తున్నారనే భ్రమలో భక్తులందరూ వీటిని కళ్ళద్దుకొని కొనుగోలు చేసేవారు. లాభనష్టాలను చూసుకోకుండా టీటీడీ ఈ అగర్బత్తిల తయారీ కోసం అదనంగా మరో కేంద్రాన్ని కూడా ఎస్వీ డైరీ ఫామ్ లోనే గత ఏడాది ప్రారంభించింది.
ఎస్పీ డైరీ ఫామ్ లో అగర్బత్తిల తయారీ కేంద్రంలో తెర వెనుక జరుగుతున్న మోసం అంతా నివేదిక రూపంలో అందడంతో టీటీడీ పాలక మండలి ఈ అంశంపై తాజాగా చర్చించింది. అధికారులను పిలిచి వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకుని చర్యలకు పూనుకున్నారు. ఇప్పటికే కాలపరిమితి ముగియడంతో దర్శన్ సంస్థ కాంట్రాక్టర్ రద్దుచేసి నూతన టెండర్లు తెలవాలని బోర్డు చైర్మన్ బి ఆర్ నాయుడు తీర్మానించారు. అగర్బత్తి ల తయారీ లో అత్యంత నైపుణ్యం కలిగిన జాతీయస్థాయి సంస్థలను టెండర్ల ద్వారా ఆహ్వానించి మెరుగైన సేవా దృక్పథం కలిగిన సంస్థకు అగర్బత్తిల తయారీ ఉత్పత్తి కేంద్రాన్ని అప్పగించాలని తీర్మానించారు.
మొదటి చర్యగా రసాయనాలు కలిపిన మూడు పేర్లతో కలిగిన అగరబత్తులను వాటి తయారు ఏమి ఉపసంహరించుకోవాలని సూచించారు.
తిరుపతిలోని తమ 'ఎస్వీ గోశాల మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్'లో మూడు ధూప్ అగరబత్తులను రసాయనాలతో కలిపి తయారు చేస్తున్నారని రుజువైన నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వాటి అమ్మకాలు, ఉత్పత్తిని నిషేధించింది. ఈ అగరబత్తులను దైవిక పద్ధతిలో ఉత్పత్తి చేయడానికి, టీటీడీ యంత్రాంగం 'దర్శన్ ఇంటర్నేషనల్ (పి) లిమిటెడ్' అనే ఒక ప్రైవేట్ కంపెనీతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
2021 సెప్టెంబర్ 13న, తమ ఆలయాల్లో ఉపయోగించే పువ్వులతో తయారు చేసిన అగరబత్తుల అమ్మకాలను ఘనంగా ప్రారంభించి, దేవుడికి సమర్పించే పువ్వులను తిరుమల ఆలయం నుంచి నేరుగా ఉత్పత్తి కేంద్రానికి సేకరించి ప్రచారం చేసింది. పుష్పాలను దివ్యమైన పద్ధతిలో ఎండబెట్టి, సాంప్రదాయ పద్ధతిలో శుద్ధి చేసి, పూజలలో ఉపయోగించడానికి 7 ప్రీమియం ఉత్పత్తులను తయారు చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో దీనిని ప్రవేశపెట్టి, గోశాల లోపల ఒక స్థలాన్ని కేటాయించి, కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. టీటీడీ ఫ్లోరా బత్తి అగరబత్తుల పేరుతో సృష్టి, తుష్టి, ఆకృతి, దృష్టి అనే నాలుగు సువాసనల ప్యాక్‌లు లభిస్తాయి. మరో ప్యాక్‌లో 'తందనాన', 'దివ్య పాద', 'అభయ హస్త' అనే ఆకర్షణీయమైన సువాసనలతో లభిస్తాయి.
ఏడు సువాసనల అగరబత్తులను ప్రారంభంలో తిరుమలలోని నాలుగు కౌంటర్లలో విక్రయిస్తారు. వీటిలో లడ్డు కాంప్లెక్స్ సమీపంలో మూడు కౌంటర్లు, శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న టీటీడీ పుస్తకాల దుకాణంలో ఒకటి ఉన్నాయి. ఈ యూనిట్ రోజుకు ఏడు విభిన్న సువాసనలతో 3.5 లక్షల అగరబత్తులను ఉత్పత్తి చేస్తుంది..
తిరుమలలో కొత్తగా ప్రారంభించిన ప్రయోగశాలలో జరిపిన పరిశోధనల ఫలితంగా, మూడు ప్రీమియం ఉత్పత్తులలో అవగాహన ఒప్పందం (MoU) మరియు ప్రాథమిక ఒప్పందానికి విరుద్ధమైన రసాయనాలను ఉపయోగించినట్లు రుజువైంది.
వర్గాల సమాచారం ప్రకారం, ఉపయోగించిన రసాయనాలు దీర్ఘకాలంలో హానికరం. ఈ మూడు ఉత్పత్తులలో వాడిన రసాయనాలు సిఫార్సు చేయదగినవి కావని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దృష్టి, సృష్టి అనే రెండు ఉత్పత్తులను నిషేధించారు. మరో ఉత్పత్తి తయారీని కూడా నిలిపివేశారు, దాని అమ్మకాలు కూడా ఆగిపోతాయి.
యాజమాన్య వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో మొత్తం అవగాహన ఒప్పందాన్ని ఉపసంహరించుకుంటారు. కొన్ని ఎగుమతి చేసే కొత్త ప్రసిద్ధ కంపెనీలతో పాటు, కనీసం 50 కంపెనీలు విరాళాలపై వీటిని తయారు చేయడానికి ముందుకు వచ్చాయి. అందువల్ల, ప్రస్తుత యంత్రాంగం విరాళాల పద్ధతిలో పనిచేసే ప్రసిద్ధ కంపెనీని ఎంపిక చేయాలని యోచిస్తోంది.