ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
తిరుపతిలో యాత్రికుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్ షిప్ నిర్మాణానికి సీఎం గ్రీన్ సిగ్నల్
తిరుమల మార్చ్ 21 మాయావి న్యూస్:
తిరుమలకు రోజు రోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీ దృష్ట్యా తిరుపతిలోని బసవసతి సకల సౌకర్యాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించి తగిన నివేదిక అందించాలని టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
తిరుపతి అలిపిరి ప్రాంతం వద్ద టీటీడీకి సంబంధించిన 40 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఉన్న 10 ఎకరాల శిల్పకళాక్షేత్రాన్ని మినహాయించుకుని మిగిలిన 30 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికోసం పూర్తిస్థాయిలో సర్వే జరిపి ప్రణాళిక అందించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్ ను ఆదేశించారు. శనివారం తిరుమలలో ఆయన మాట్లాడుతూ తిరుమల కొండల్లో పూర్తిస్థాయిలో ఔషధ మొక్కల పెంపకానికి కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు మూడు నెలల్లో ఇందుకు సంబంధించిన తిరుమల శేషాచల అడవులకు మొత్తం ఔషధ మొక్కల పెంపకానికి కావలసిన చర్యలు చేపట్టాలని అవసరమైతే ఈ కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలన్నారు. తిరుపతిలో ఉన్న వాతావరణానికి తిరుమలలో ఉన్న వాతావరణానికి సమతుల్యత పాటించేందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరుపతి కంటే తిరుమల కొండపై దాదాపు 8 సెల్సియస్ డిగ్రీల తేడా ఉండాలని దీన్ని కాపాడేందుకు కూడా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. తిరుమలలో వాతావరణాన్ని సూచించే ఎలక్ట్రానిక్ సూచిక బోర్డులను మరిన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీటీడీకి సంబంధించిన విద్యుత్తు అవసరాలు ఏ మేరకు సమకూర్చుకున్నది పవన విద్యుత్ ద్వారా ఇప్పటికే శేషాచల కొండల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ రెక్కల ద్వారా ఏ మేరకు విద్యుత్ సరఫరా అవుతున్న తయారవుతున్నది ఇంకా ఏ మేరకు అవసరమవుతున్నది పూర్తిస్థాయి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించాలని టిటిడి పూర్తిస్థాయిలో సొంతంగా విద్యుత్తును తయారు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సీఎం ప్రశ్నలకు నీళ్లు నమిలిన అధికారులు :
సహజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం పై పూర్తిస్థాయి పట్టు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి గుక్క తిప్పుకోనివ్వకుండా చేశారు. సీఎం చంద్రబాబు వేసిన ప్రశ్నలకు అధికారుల వద్ద కనీసం సమాధానాలు లేకపోయాయి. అసలు ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ప్రశ్నిస్తారని అన్నిటి గురించి వివరంగా అడుగుతారని అధికారులు అసలు అంచనా వేయలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అవసరాలకు తయారవుతున్న విద్యుత్ పై ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. అలాగే ఉష్ణోగ్రతలు తిరుమలలో వాతావరణం పై ఇప్పటివరకు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించగా దానిపై కూడా నీళ్లు నమిలారు. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన అనేక ప్రశ్నలకు అధికారుల వద్ద నుండి మౌనమే సమాధానమైంది. దీన్నిబట్టి ఆలోచిస్తే టీటీడీలో సమర్థులైన అధికారులు పరిపాలనపై పట్టు ఉన్న అధికారులు ఏమాత్రం ఉన్నారు అర్థం చేసుకోవచ్చు.