ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని ఆపాలి. తిరుపతిలో అఖిలపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం
*ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయిల్ యుద్ధంన్మాదాన్ని ఆపాలి!*
*రాజకీయ పార్టీలు, కార్మిక , ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి*
తిరుపతి మార్చ్ 29 మాయావి న్యూస్
*అమెరికా ఇజ్రాయిల్ ఏకపక్ష నిర్ణయంతో ఇరాన్ పై కొనసాగిస్తున్న దుర్మార్గమైన యుద్ధోన్మాదాన్ని మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఖండించి. యుద్ధం వద్దు ప్రపంచ శాంతి ముద్దు అన్న నినాదాన్ని యావత్ ప్రపంచం వినే విధంగా హోరేత్తించాలని ఆదివారం ఉదయం 11 గంటలకు తిరుపతి బైరాగి పట్టెడ నందు ఉన్న గంధం అనే శివయ్య భవనం లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, దక్షిణ భారత అధ్యక్షులు పి. అంజయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.*
*ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ (ఎంఎల్ న్యూ డెమోక్రసీ) నాయకులు పి వెంకటరత్నం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ*
*ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ కొనక సాగిస్తున్న అహంపూరిత దాడులను కేంద్రంలో కొనసాగుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట వరసకైనా ఖండించకపోవడం చూస్తుంటే ట్రంప్ కు మోడీ సాగిలపడినట్లు స్పష్టం అవుతుందని తెలియజేశారు అంతేకాకుండా*
*మన భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఇటీవల విశాఖ పట్టణమునందు జరిగిన నేవీ పెరడ్ ఉత్సవాలకు వివిధ దేశాలకు చెందిన నేవీ షిఫ్ట్ లు పాల్గొన్నాయి అందులో భాగంగా ఇరాన్ నేవీ షిప్ కూడా పాల్గొని తిరిగి వెళుతున్న సందర్భంగా హిందూ మహాసముద్రం లో శ్రీలంక సమీపాన ఇరాన్ నేవీ షిప్ పై ఇజ్రాయిల్ షీపనలతో దాడి చేయడంతో ఇరాన్ షిప్ లో ఉన్న 90 మంది నేవీ అధికారులు దుర్మరణం పాలైనారు రక్షణ కల్పించాల్సిన భారత ప్రభుత్వం ఈనాటికి ఖండించకపోవడం అత్యంత బాధాకరమైన అంశమని రౌండ్ టేబుల్ సమావేశంలో తమ ఆవేదనను*
*ఏ ఐ టియుసి జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, సిఐటియు నాయకురాలు లక్ష్మీ ,మైనార్టీ నాయకులు ఇసాక్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి చిన్నం కాళయ్య అధ్యక్షులు నాగభూషణం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి శీను, ఏ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఉదయ్, మహిళా సమాఖ్య నాయకురాలు జయలక్ష్మి దళిత నాయకులు హరిబాబు ధనంజయులు దేవానందం బీసీ సంఘర్షణ సమితి బి లక్ష్మయ్య, పౌర సమాజ చైతన్య వేదిక కార్యదర్శి ఏఎన్ పరమేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడటం జరిగింది*