చంద్రబాబు వైసీపీతో కుమ్ముకయ్యారా...!?

బాబు అసమర్ధతతో రెచ్చిపోతున్న వైసిపి శ్రేణులు

చంద్రబాబు వైసీపీతో కుమ్ముకయ్యారా...!?

చంద్రబాబే వైసీపీతో కుమ్ముక్కయ్యారా..!?

పరిపాలనపై చంద్రబాబుకు పట్టు లేదా..?

పార్టీనే కాదు కార్యకర్తలను కూడా కాపాడుకోలేరా!?

 (టిడిపి శ్రేణుల కు సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారంలో ఉన్న ఈ కథనం మాయావి పాఠకుల కోసం )

 తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలను సైతం ఇచ్చే నాయకులు కార్యకర్తలు ఇప్పుడు చంద్రబాబు వైఖరితో ఆవేదన చెందుతున్నారా..!? బాబు మెతక వైఖరితో పరిపాలన పరమైన పట్టు కోల్పోతున్నారా..? ఇంతకాలం పార్టీని ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులపై కఠినంగా వ్యవహరించాల్సింది పోయి... వైసీపీ వాళ్ళలోని కొంతమంది ముఖ్యులతో కుమ్ముకయ్యారా.. అనే అనుమానాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు తన అసమర్ధత పరిపాలనపై పట్టు కోల్పోవడం చూస్తుంటే పార్టీలోని నాయకులు కార్యకర్తలు కాదు స్వయంగా చంద్రబాబే కొన్ని పనులు వైసిపి వాళ్లతోటి పరోక్షంగా చేయించుకుంటూ వాళ్ళని ఏదోరకంగా కేసులు అవి పెట్టకుండా కాపాడుకుంటూ రక్షిస్తున్నారని తెలుగుదేశం పార్టీలోని ముఖ్యులు, కూటమి ప్రముఖులు ఇప్పుడు చంద్రబాబు పనితీరుపైనే అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తున్నది. 

ప్రభుత్వ అధినేత చంద్రబాబు మీదనే మొన్న ఒక సీఐ, ఇవాళ ఒక డిఎస్పీ స్థాయి అధికారులు కేసులు పెట్టటం అంటే రాజకీయ అనుభవజ్ఞుడైన చంద్రబాబు కి కార్యనిర్వాహాక వ్యవస్థ మీద పట్టు రాలేదు అనో, లేక కోల్పోయారు అనో అనుకోవాలి.

టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు మీద మార్ఫింగ్ వీడియోస్ తో దుష్ప్రచారం చేస్తున్నారు అంటే చంద్రబాబు నడిపే ప్రభుత్వం అంటే భయం లేకపోగా అలుసు అని అనుకోవాలి. 

ప్రభుత్వంలో పెద్దలు , చంద్రబాబు అభివృద్ధి అనే భ్రమల్లో బతుకుతున్నారు. 

లోకేష్ మీడియాలో ఇంగ్లీష్ లో మాట్లాడే బిట్లు, నాయకుల కుటుంబాల ఆత్మీయ సమావేశాల వీడియోలు తనభక్తుల చేత షేర్ చేపించుకొని నేను అద్భుతం అనుకుంటున్నారు. 

ఎక్కువమంది నాయకులు అందినకాడికి దోచుకొని అదేమంటే లోకేష్ కి వాటా ఉంది.. మీరేమైనా చేసుకోండి మాకు భయం లేదు అని చెప్తున్నారు.  

 పార్టీకి కష్టపడిన కార్యకర్తలేమో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ వైసీపీ వాళ్ళతో రాజీ పడిపోయారు, వైసీపీ కాంట్రాక్టర్ లకే పనులు ఇచ్చి డబ్బు సంపాదించుకుంటున్నారు, ఈ పార్టీలో కార్యకర్తలని ఎవడూ పట్టించుకోడు. వీళ్ళ కోసం మనం ఎవడితోనో ఎందుకు పోరాడాలి అనుకుంటున్నారు. ఏదైనా జరిగినా అండగా నిలబడి కార్యకర్తను కాపాడుకునే పరిస్థితి ఈ పార్టీలో లేదు అనే స్థితికి వచ్చారు.

కొత్త ఆశావహులు మనం పార్టీ కి ఏమి చెయ్యనవసరం లేదు ఆ సమయం కి బరువు తూగ గలిగితే చాలు అనుకుంటున్నారు. 

నిజమైన రాజకీయం జగన్ రెడ్డి చేస్తున్నాడు. 11 సీట్లకి పడి చావు దెబ్బ తిన్నా జగన్ చేస్తున్న రాజకీయ్యం వీళ్లకు దడ పుడుతోంది . అమ్మకానికి ఉన్న ప్రతి ఒక్కడిని కోనేస్తున్నాడు .చంద్రబాబు చుట్టూ తనమనుషులని పెట్టుకున్నాడు. అధికారులు ఎక్కువమంది వాడి మనుషులే. వ్యవస్థల్లో వాడి మనుషులే. టీటీడీలో కూడా వైసిపి సానిభూతిపరులైన అధికారులే కొనసాగుతున్నారు. కనీసం వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ప్రభుత్వమే అడ్డుకుంటోంది.

 వైసిపి హత్యా కక్ష రాజకీయాలకు విసిగి వేసారని జనం వారిపై చర్య తీసుకునేందుకే మన పార్టీకి పట్టం కట్టారు. కానీ మనం ఏం చేస్తున్నాం వారిలాగా మనం ఉండకూడదు వారికి మనకి తేడా ఏముంటది అంటూ వైసీపీ వాళ్లని ఏ కేసులు పెట్టకుండా వదిలి పెట్టేసాం. ఫలితంగానే ఇప్పుడు వాళ్లు మరింత బలవంతులై తెలుగుదేశం పార్టీకి పాటు ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు.

 కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు అందరూ ఇప్పుడు మళ్లీ బహిరంగంగా ప్రజల వద్దకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదంతా మన చేతకాని తనమే అంటూ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.  

ఇంకో ఆరు నెలల్లో జగన్ టిడిపి వాళ్ళకి నిద్రకూడా పట్టనివ్వడు. రోజుకొక సమస్య సృష్టిస్తాడు. వీళ్ళు తత్తరబితర్లు ఆడే సరికి కొత్త సమస్య పెడతాడు.

 ఇదే పరిస్థితి ఉంటే ఇక వచ్చే ఎన్నికల్లో మన పరిస్థితి దారుణంగా తయారై వైసీపీకి అధికారాన్ని పళ్లెంలో పెట్టి అప్పగించే ప్రమాదం ఉంది.