టీటీడీ రవాణా విభాగంలో అవినీతి అనకొండ.. రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు బివైడి ఎలక్ట్రికల్ కార్లు ధారా దత్తం
టీటీడీ రవాణా శాఖలో అవినీతి అనకొండ
👉 శ్రీవారికి దాతలు ఇచ్చిన వాహనాలు అప్పనంగా వైసిపి నేతలకు అప్పగింత...
👉రెండు కోట్ల విలువైన 5 బి వై డి ఎలక్ట్రికల్ కార్లు మటుమాయం?
👉వెంకన్నకు దాత ఇచ్చిన వెండి సైకిల్ ఏమైందో?
👉తుప్పు పట్టిన పొదల్లో 100 ఎలక్ట్రికల్ సైకిళ్లు
👉40 లక్షల విలువైన భారీ టిప్పర్ వస్తువులన్నీ మటుమాయం..?
👉 ఉద్యోగులపై వేధింపులు... కార్మికులపై కక్ష సాధింపులు...
👉అ"శేష"మైన అక్రమాలు... అయినా ఆయన్ను ఏమీ పీకలేరు...!?
కోలా లక్ష్మీపతి /ఎడిటర్/ మాయావి న్యూస్:✍️
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనో అవినీతి అనకొండ... అక్రమాలకు అన్యాయాలకు కేరాఫ్ అడ్రస్... ఆయన తన సర్వీసులో పాల్పడిన అక్రమాలు అన్ని ఇన్ని కావు.. విధి నిర్వహణలో టిటిడి సొత్తు దుర్వినియోగం చేయడంలో ఆయనకు సాటి ఎవరూ రారు... దేవుడికి విరాళంగా ఇచ్చిన వాహనాలను దాతల మనోభావాలను అవహేళన చేసే లాగా తన ఇష్ట రాజ్యంగా తనకి ఇష్టమైన వ్యక్తులకు దారాదత్తం చేశాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా టీటీడీ వస్తువులను, కోట్లాది రూపాయల విలువైన వాహనాలను తమ సామాజిక వర్గానికే చెందిన వైసిపి నేతలకు అప్పనంగా దానం చేశారు. భక్తులు ఇచ్చిన విరాళాలను సరైన పద్ధతిలో వినియోగించుకోకుండా తన సొంతంగా వాడుకున్నారు.
ఏకంగా ఎలక్ట్రికల్ బస్సు ని ఒక దొంగ తిరుమల కొండ నుండి దొంగతనం చేసి ఎత్తుకెళ్లిపోయినా అతనికి మతిస్థిమితం లేదని చెప్పి బుకాయించి తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం ఆయనకే సాధ్యమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఉద్యోగులకు చేసిన అన్యాయాలు కార్మికులకు చేసిన కక్ష సాధింపులు అన్నీ కావు.. అంతెందుకు ఆర్టీసీ సంస్థ నుండి టీటీడీకి రెండేళ్ల పాటు డిప్యూటేషన్ పై వచ్చి పూర్తిగా ధార్మిక సంస్థలోనే తిష్ట వేసి, 22 ఏళ్ల పాటు తనని ఎవరు ఏమి చేయలేదు అని ధీమాతో కొనసాగినా... ఈ నెలాఖరున జిఎంగా పదవి విరమణ చేయనున్న ఆయన నియామకమే టీటీడీలో అప్పట్లో ఒక పెద్ద ఆక్రమం..
అయినా ఇన్ని అక్రమాలు బయటపడినప్పటికీ ఇంతకాలం ఆయన ఎలా కొనసాగారు అనే అనుమానం ఎవరికైనా రావడం సహజమే... నిజమే ఆయన పక్కా వైసిపి అభిమాని... వైసిపి పెద్దల కోసం ఎంతకైనా తెగిస్తారు ఏమైనా చేస్తారు... అదే ఆయన ఉండాల్సిన క్వాలిఫికేషన్ కాబట్టి ఎన్ని విజిలెన్స్ విచారణలు వచ్చినా ఎవరు ఆయన్ను ఏమీ పీకలేకపోయారు.. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన విధంగా టీటీడీలో తనకు 2000 మంది కోవర్టులు ఉన్నారని ధైర్యంగా చెప్పిన ఆయన కోర్టులో ఈ అధికారి కూడా ఉన్నారనేది ఏ మాత్రం సందేహం లేని నిజం. అయినా కూటమి ప్రభుత్వం వచ్చిన ఎటువంటి చర్యలు లేవు. పైగా ఆయన తప్పులన్నీ సమర్థించుకుంటూ కూటమి ప్రభుత్వం కూడా ఆయనను ఇంకా అనేక బాధ్యతలను సమర్ధుడు అయిన అధికారిగా వినియోగించుకోవడం ఆయనకు చేకూరిన అదనపు అర్హతలు అనుకోవచ్చు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారిపై భక్తి విశ్వాసాలతో అనేక మంది దాతలు వివిధ రూపాల్లో కోట్లాది విలువైన విరాళాలు స్వామివారికి సమర్పిస్తుంటారు. ఇలా వాహనాల రూపంలో అనేక సంస్థలు వ్యక్తులు మొదటగా తయారు చేసిన వాహనాన్ని భారీ వాహనాల నుండి చిన్న వాహనాల వరకు ఇటీవల ఎక్కువగా విద్యుత్ వాహనాలు బ్యాటరీ వాహనాలను శ్రీవారికి కానుకగా సమర్పించారు. కొన్ని కోట్ల విలువైన ఈ వాహనాలను సంరక్షించాల్సిన బాధ్యత వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ట్రాన్స్పోర్ట్ విభాగానిదే. దానికి జనరల్ మేనేజర్ అయిన శేషారెడ్డి పనితీరుపై సంస్థలో ఎవరిపైన రానన్ని ఆరోపణలు వచ్చాయి.
ఇందులో కొన్ని ప్రధానమైన అవినీతి ఆరోపణలు
🌱 2022లో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఐదు బివైడి ఎలక్ట్రికల్ కార్లను టిటిడి కి విరాళంగా అందజేసింది. ఈ వాహనం ఒక కారు 34 లక్షల రూపాయల విలువ చేస్తుంది. అలాంటి ఐదు కార్లు టీటీడీకి విరాళంగా ఇస్తే వీటిని సంస్థకు విరాళం ఇచ్చిన విధంగా లెక్క రిజిస్టర్లో రాయకుండా వాటిని అప్పట్లో టిటిడి చైర్మన్ గా పని చేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డి మరో ఇద్దరికి వ్యక్తిగతంగా విరాళం ఇచ్చినట్లుగా రిజిస్టర్లో నమోదు చేసి ఈ వాహనాలను వారి సొంతానికి అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి. ఇది సుమారు రెండు కోట్ల రూపాయలకు విలువైన వాహనాలు ఇప్పటికీ ఏమైపోయాయో టిటిడి లెక్కల్లో లేదు.
🌱 అదేవిధంగా మూడేళ్ల క్రితం ఒక దాత వెంకన్నకు పూర్తిగా వెండితో చేయించిన సైకిల్ ను టీటీడీకి విరాళంగా అందించారు. అయితే ఈ సైకిల్ టిటిడి ట్రాన్స్పోర్ట్ విభాగం స్వాధీనం చేసుకున్న తరువాత ఏమైందో ఇప్పటికీ కనిపించడం లేదు.
🌱 ఇటీవల రెండేళ్ల క్రితం టిటిడి కి కొత్తగా వచ్చిన ఎలక్ట్రికల్ సైకిల్స్ 100 వాహనాలను శ్రీవారికి విరాళంగా అందించారు. అయితే వీటిని ఇప్పటివరకు వినియోగించిన దాఖలాలు లేవు. అలాగని వీటిని విక్రయించేందుకు టెండర్లు నిర్వహించిన పరిస్థితి లేదు. దీంతో తిరుపతిలోని ట్రాన్స్పోర్ట్ విభాగంలోని ఆరుబయట తుప్పు పట్టిన పొదల్లో 100 సైకిళ్లు కూడా తుప్పు పట్టి పోయాయి.
🌱 ఇదే విధంగా మరో భక్తుడు స్వామి వారికి మొక్కుబడితో ఒక భారీ టిప్పర్ను దాదాపు 45 లక్షలు వెచ్చించి విరాళంగా అందించారు. అయితే ఈ వాహనాన్ని ఎవరికీ అప్పగించలేదు కనీసం ఇంజనీరింగ్ భాగానికి పనులకు వాడుకోలేదు ట్రాన్స్పోర్ట్ విభాగంలోనే ఒక మూలన పడేశారు. దీంతో ఇంతటి విలువైన లారీ తుప్పు పట్టింది. అందులో విలువైన వస్తువులన్నీ మాయమైపోయాయి పైకి చూస్తే బాగా కనిపించేలాగా టైర్లు మార్పించి అలంకారప్రాయంగా ప్రస్తుతం అలా ఉంచారు.
🌱ఇలా చెప్పుకుంటూ పోతే ..
అవినీతి కూపంలో రవాణా విభాగం.. వాహనాల కొనుగోళ్లలో భారీ స్కామ్ శేషారెడ్డి హయాంలో రవాణా విభాగం నిలువెల్లా అవినీతిలో మునిగిపోయింది. ఈ మాట టీటీడీలో పనిచేసే ఏ ఉద్యోగిని అడిగినా టక్కున చెప్పేస్తారు.
* **కొనుగోళ్లలో అక్రమాలు:** కొత్త వాహనాల కొనుగోలు, విడిభాగాలు, టైర్లు, ఆయిల్ వంటి నిత్యావసరాల టెండర్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
*వ్యవస్థ నిర్వీర్యం:** సొంత లాభాల కోసం, కాంట్రాక్టర్లతో చేతులు కలిపి రవాణా విభాగాన్ని క్రమంగా మూసివేసేలా (ప్రైవేట్ పరంచేసేలా) వింత ధోరణితో శేషారెడ్డి వ్యవహరించారు.
🌱టీటీడీ రవాణా విభాగంలో జీఎం శేషారెడ్డి హయాంలో జరిగినట్లు చెప్తున్న అరాచకాలు, అవినీతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పట్ల ఆయన ప్రదర్శించిన వివక్షపై కార్మిక లోకం నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహం టీటీడీ రవాణా విభాగంలో శేషారెడ్డి అరాచకాలు: కార్మికుల ప్రాణాలతో చెలగాటం, అవినీతి అక్రమాల్లో రికార్డు! సాధించారు.
🌱అసలు ఆయన నియామకమే అడ్డగోలుగా...
🌱 వాస్తవానికి 2005లో ఆర్టీసీలో డిపో మేనేజర్ గా పని చేస్తున్న శేషారెడ్డి అక్కడినుండి పెద్ద ఎత్తున పైరవీలు చేసి టీటీడీలో డిప్యూటేషన్ పై రెండేళ్లపాటు ట్రాన్స్పోర్ట్ జిఎం గా నియమితులయ్యారు. అటు తరువాత తిరిగి ఆర్టీసీకి వెళ్లకుండా టీటీడీలోని వైసిపి పెద్దలను మచ్చిక చేసుకుని మెల్లగా తన కోసమే ఒక పోస్ట్ క్రియేట్ చేసి 2007లో పేపర్లో నోటిఫికేషన్ వేయించుకున్నారు. నోటిఫికేషన్ లో కూడా శేషారెడ్డి కోసమే అన్నట్లుగా వయసు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి అని పేర్కొన్నారు. తీరా దాంట్లో ఇతరులు పోటీకి వచ్చేటప్పటికి అక్రమంగా రెండవ నోటిఫికేషన్ తనకోసమే అన్నట్లుగా 46 ఏళ్ళు ఉండే విధంగా రీ నోటిఫికేషన్ ఇప్పించారు. దీనిపై అప్పట్లో డిప్యూటీ ఎక్స్పోజింగ్ ఆఫీసర్గా పనిచేసిన టిఏపి నారాయణ అనే అధికారి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు. అయినా వడ్డించేవాడు మనవాడైతే అన్న విధంగా శేషారెడ్డి టీటీడీలో ప్రవేశించి 22 రెండేళ్లు తనకు ఎదురేలేదు అన్న విధంగా వ్యవహరించారు.
🌱 ఇక అప్పటినుండి ఈయన కంటే మించిన సమర్థులు లేదు అన్న విధంగా వైసిపి పెద్దలు ట్రాన్స్పోర్ట్ జిఎం గానే కాకుండా ఐటీ జనరల్ మేనేజర్ గా కూడా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణాలు పాల్పడినట్లు శేషారెడ్డి పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పూణేలోని ఒక ఐటీ సంస్థతో కుమ్ముక్కై పెద్ద ఎత్తున టికెట్ల కుంభకోణానికి పాల్పడినట్లు శేషారెడ్డి పై కేసులు కూడా నమోదు అయ్యాయి. విజిలెన్స్ విచారణలు జరిగాయి అయినా ఏమి తేలలేదు.
🌱 దటీజ్ శేషారెడ్డి... అనడం కంటే వైసీపీ కోవర్టులను కూడా కూటమి ప్రభుత్వం వెనకేసుకొస్తూ పెంచి పోషించడమే కాకుండా ప్రమోషన్లు ఇచ్చి మరీ కూటమి ప్రభుత్వం కొట్టించుకోవడమే ఇక్కడ ఉద్యోగులకు అర్థం కాని వ్యవహారంగా తయారైంది. కొసమెరుపు ఏమిటంటే... ఈనెలాఖరున అంటే వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్న శేషారెడ్డి ని ఆయన సేవలకు కొనసాగింపుగా మరో రెండేళ్లపాటు అదే పదవిలో కొనసాగించడానికి టిటిడి బోర్డు సమావేశంలో అజెండా ప్రవేశపెట్టనున్నట్లు... ఇందుకు ఉన్నతాధికారులు సహకారం అందిస్తున్నట్లు సమాచారం. ఓం నమో వెంకటేశాయ.