వైయస్ జగన్ పైత్యానికి నిదర్శనం మావిగన్.. అమరావతికి చట్టబద్ధతతో జగన్ కు పిచ్చెక్కిందా.?

వైయస్ జగన్ పైత్యానికి నిదర్శనం మావిగన్

వైయస్ జగన్ పైత్యానికి నిదర్శనం మావిగన్.. అమరావతికి చట్టబద్ధతతో జగన్ కు పిచ్చెక్కిందా.?

"జగన్" పైత్యానికి నిదర్శనం " మావిగన్" 

 అమరావతికి చట్టబద్ధతతో జగన్ కు పిచ్చెక్కినట్లుంది 

 వైయస్ జగన్ ధోరణితో వైసీపీకి అధోగతే!?

 కోలా లక్ష్మీపతి /ఎడిటర్ /మాయావి న్యూస్ :

 పిచ్చి కుదిరింది... రోకలి తలకి చుట్టమన్నాడట వెనకటికొకడు... తల తిక్క నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి.. అమరావతిని అటకెక్కించేసి... మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటలాడి.. ప్రజాభిమానం కోల్పోయి.. చివరకు అధికారం కోల్పోయినా.. రెండు ఒకట్లు స్థానాలు మిగిలినా కూడా... లోటస్ రాజు వైయస్ జగన్ కు ఇంకా ఈ తలతిక్క కుదిరినట్లు లేదు. అసెంబ్లీ కెళ్ళి ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కును కాలదన్నుకుని తీరిగ్గా ఎవరు అడగకపోయినా పనికిమాలిన సలహాలు ఇస్తూ మావిగన్ అని రాజధాని పేరు పెట్టండి అంటూ జగన్ తన పబ్జి గేమ్ తెలివిని తేట తెల్లం చేశాడు. 

 రైతులు త్యాగాలు చేసి.. భూములు ఇచ్చినా..జగన్ రెడ్డి కి అమరావతి రాజధాని వద్దట.. మూడు రాజధానులు అటకెక్కిపోయి... ఇప్పుడు మూడు నగరాల పేర్లను కలుపుతూ.. మావిగన్ రాజధాని ముద్దట.. చింత చచ్చినా పులుపు చావధన్నట్లుగా, అధికారం కోల్పోవటానికి ఏవైతో అంశాలు కారణమో.. అవే అంశాలను వైసీపీ మాజీ మంత్రులు, మళ్ళీ తెర పైకి తెస్తున్నారు.. మెజారిటీ ప్రజలు ఛీ ఛీ ఛీ కొట్టినా, ఎన్నికలలో ఘోరాతి ఘోరంగా ఓడించినా, వైసీపీ నేతలకు కొంచెం కూడా బుద్ధి రాలేదు కధా! ఈవీఎం లును మార్చి, ఎన్నికలలో గెలిచి అధికారం లోకి వచ్చారని ఆరోపణలు చేశారు.. ఈవీఎం లను మార్చే విధానం తెలిస్తే , తమకు 440 సీట్లు వస్తాయని, ఎన్నికల ప్రచారం లో, మోడీ తో పాటు అమిత్ షా చేసిన ప్రసంగాలు నిజమయ్యేయి.. ఇదంతా ప్రక్కనబేడితే తాజాగా, జగన్ రెడ్డి గారు, మరొక రాజధాని పేరును తెర పైకి తెచ్చి సంచలనం లేపారు.. అదేమిటంటే.. అమరావతి రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందనీ .. విజయవాడ, మచిలీపట్టణం, గుంటూరు ప్రాంతాల మధ్యలో రాజధానిని నిర్మించి , దానికి మావిగన్ అనే పేరు పెట్టాలనీ కోరారు .. ఇక్కడ రాజధానిని నిర్మిస్తే కేవలం 10% అంటే, 20 వేల కోట్లు ఖర్చుతో రాజధానిని నిర్మించవచ్చు ననీ కూడా సెలవిచ్చారు. అధికారం లో లేనప్పుడు అమరావతి రాజధానికి మద్ధతివ్వటమే కాకుండా, 30 వేల ఎకరాల భూములును సేకరించాలని, సాక్షాస్తూ అసెంబ్లీ లో ప్రసంగించి, అధికారం లోకి వచ్చాక "సౌత్ ఆఫ్రికా" దేశం లో మూడు రాజధానులు ఎలా వున్నాయో, ఆ విధంగా మూడు రాజధానులు ను, ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాడు చేస్తే బాగుంటుందన్నారు.. "పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికి పెట్టిందట" అనే చందంగా... అంతటి తో ఆగారా?! మూడు రాజధానులు బిల్లును అసెంబ్లీ పెట్టి, ఆమోదింప చేసుకున్నారు.. ఎన్నికల ప్రచారం లో ఇంకేమన్నారంటే.. మళ్ళీ తానే అధికారం లోకి వస్థానని, విశాఖపట్నం లోనే తాను సీఎం గా ప్రమాణం స్వీఖారం చేస్తానన్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనుడుగా, జగన్ రెడ్డి కి ఘనమైన పేరొచ్చింది.. ఎన్నికలలో ఘోరాతి ఘోరంగా ఓడిపోవటానికి కారణమైన మూడు రాజధానుల విధానాన్ని, మళ్ళీ తెర పైకి తీసుకురాకున్నా, కొత్తగా "మావిగాన్ " ను తెర పైకి తెచ్చారు.. అమరావతి రాజధానే, తన ఓటమికి కారణం అయినా కూడా, ఇంకా జగన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోలేదని, వైసీపీ కార్యకర్తలు అభిమానులే, ఆయనను అసహ్యయించు కుంటున్నారట.. మేము మళ్ళీ అధికారం లోకి వస్తే, మళ్ళీ మూడు రాజధానులు గా, చట్టం మారుస్తామంటున్నారు వైసీపీ ఉత్తరాంద్ర మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మన ప్రసాద్ రావులు... మూడు రాజధానులే, మా కొంప ముంచిందన్నారు.. వైసీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు లు... కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దగ్గరపడిన మరో మూడేళ్లు కూటమి ప్రభుత్వ పరిపాలనపై కన్నేసి మంచి ఆరోగ్యకరమైన రాజకీయాలను చేయాల్సిన వైసిపి నేతలు అందుకు విరుద్ధంగా అర్థంపర్థం లేని మాటలు వాక్యాలతో చేజేతులారా తమ కొంపకు తామే నిప్పుటించుకుంటున్నారు. జనం మన పార్టీపై ఎలాంటి ఆశలు పెట్టుకొని ఉన్నారో అనే ఆలోచన కూడా వైసిపి నేతల్లో లేనట్టుంది. ఒకవైపు రాష్ట్రంలో ఏదో విధంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్న వైసిపి తన పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుడైన భూమన కరుణాకర రెడ్డి టీటీడీని టార్గెట్ గా చేసుకుని చేస్తున్న విమర్శల కారణంగా కూటమి నేతలు చేసిన ఎదురుదాడితో ఒక రకమైన మతపరమైన ముద్ర వైయస్ జగన్ పై పడింది. హిందూ వ్యతిరేకిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎంతకు దిగజార్షాలో అంత పని చేశారు కూటమి నేతలు. అయినా కూడా తన వైసీపీకి తనకు జరుగుతున్న రాజకీయ నష్టాన్ని వైయస్ జగన్ గుర్తించడం లేదు. 

 బెంగళూరు లోటస్ పాండ్ నుండి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కనీసం మీడియా ముందు మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ...ఇలాంటి తల తిక్క మాటలు మాట్లాడుతూ.. అప్పుడప్పుడు వివాదాలకు ఆజ్యం పోస్తూ.. తన అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకుంటూ ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్ మాటల ద్వారానే తప్పులు వెతికి చూపి మరీ కడిగిపారేస్తున్న కూటమి ప్రభుత్వం నేతలకు నోటి నిండా పని చెబుతున్నారు తన అర్థం లేని మాటలతో వైయస్ జగన్.