మహిళా అధికారిణితో సన్నిహితంగా అప్పట్లో భూమన
బలిజలు × యాదవులు
కులాల మధ్య కుంపట్లు పెడుతున్న వైసిపి
ప్రమాదకరమైన రాజకీయం చేస్తున్న భూమన
మహిళా అధికారిణితో ఆలయంలోనే గంటల తరబడి అప్పట్లో తిష్ట వేసిన భూమన..?!
తాను చేస్తే శృంగారం.. ఎదుటి వారు చేస్తే వ్యభిచారమా!?
అనునిత్యం ఆరోపణలతో తిరుమల ప్రతిష్ట దిగజార్చిన భూమన
కోలా లక్ష్మీపతి /ఎడిటర్ /మాయావి న్యూస్:
టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయనపై వ్యక్తిగత కక్ష పెంచుకొని, కంటిమీద కునుకు లేకుండా ప్రతి రోజు ఏదో ఒక ఆరోపణలు, విమర్శలు చేస్తూ టీటీడీ సంస్థ పరువు తీయడమే కాకుండా తిరుమల ప్రతిష్ట దిగజారేలా వ్యవహరించిన మాజీ టీటీడీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసిపి కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు తన దృష్టి టీటీడీ వైపు నుంచి పక్కకు మళ్లించి తిరుపతిలోని అధిక శాతం ఓటు బ్యాంకు కలిగిన బలిజలు వారి తరువాత రెండవ స్థానంలో ఉన్న యాదవుల మధ్య చిచ్చు పెట్టే కుట్ర పన్నారు. ఇప్పుడు ఆ రెండు కులాల నేతల మధ్య తిరుపతిలో అంతర్గతంగా మనస్పర్ధలు మొదలయ్యాయని సమాచారం. ఇక్కడ అధికారం కోసం కాకపోయినా ఆధిపత్యం కోసం వారి మధ్య కులాల కుంపటి రగిలించి చలికాచుకుంటున్న భూమన ప్రమాదకరమైన రాజకీయం ఆందోళన కలిగిస్తోంది. భూమన వేసిన ట్రాప్ లో ఇప్పటికే యాదవులు పడిపోయారని ఈ మేరకు పనిగట్టుకుని బలిజలపై కులం పేరుతో దూషిస్తూ మరి ప్రెస్ మీట్ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమన చుట్టూ బలిజలు యాదవులే కాకుండా రెడ్లు కమ్మ, నాయుడులు అందరూ తన అనుచరులుగా ఉన్నప్పటికీ కేవలం బలిజలు యాదవుల మధ్యే కుంపటి రగిలించేలా రాజకీయం చేస్తున్నారని ఇప్పుడు ఆయా సంఘాల నేతలు అంటున్నారు.
తన కుమారుడు అభినయ రెడ్డి గత ఎన్నికల్లో ఘోరమైన పరాజయం చవి చూడడాన్ని ఆయన ఈనాటికీ జీర్ణించుకోలేకపోతున్నాడని భూమన కు సన్నిహితంగా ఉన్నవారే బహిరంగంగా చెబుతున్నారు. ఇప్పటికీ ఎవరైనా ఆయన వద్దకు పని మీద వెళ్ళినా.. బలిజలకు, యాదవులకు నిర్మొహమాటంగా వారి మొహం పైనే మీరంతా కలిసికట్టుగా నా కుమారుడిని ఓడించారు. అలాంటప్పుడు మీకెందుకు సాయం చేయాలి అంటూ తిరిగి ప్రశ్నిస్తున్న భూమన వైఖరిపై ఖంగు తింటున్నారు.
వాస్తవానికి గత ఎన్నికలకు ముందు తిరుపతి అసెంబ్లీ సీటు జనసేన పార్టీ తరఫున ఆరణి శ్రీనివాసులకు కేటాయించగానే భూమన కుమారుడైన అభినయ రెడ్డి పరోక్ష రాజకీయ కుట్రలు చేశారు. మాకు ఈ అభ్యర్థి వద్దు అంటూ ఆరని శ్రీనివాసులు ను చిత్తూరుకే తిరిగి పంపాలంటూ తిరుగుబాటు కార్యకర్తల పేరుతో వివాదాస్పదమైన ఫ్లెక్సీలు వేయించి, స్థానికత పేరుతో తిరుపతిలో బలిజ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు.
జనసేనలో అనూహ్యంగా ఎదుగుతున్న కిరణ్ రాయల్ అనే నేతపై వ్యక్తిగతమైన అంశాలను తెరమీదకి తీసుకొచ్చి అతనిని వివాదాస్పద అంశంలోకి నెట్టడం లాంటి రాజకీయాలకు వైసీపీ నేతలే ఆనాడు తెర తీశారు. అటు తరువాత ఏదోలా కిరణ్ రాయల్ వైసీపీ కుతంత్ర రాజకీయాన్ని తట్టుకుని నిలబడి మళ్లీ జనసేన నేతగా వెలుగొందుతున్న తరుణంలో ఇక లాభం లేదనుకొని ఇప్పుడు వైసీపీలోని కొందరు కిందిస్థాయి మహిళా నేతలు బలిజలను కులం పేరుతో బూతులు తిడుతూ నువ్వు అసలు బలిజవాడివే కాదు మా యాదవులను టార్గెట్ చేస్తావా అంటూ అనవసరమైన మాటలతో ప్రెస్ మీట్లలో కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని వైసిపి పరోక్షంగా ప్రోత్సహిస్తుందని అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల దాకా ఇలాగే కులాల మధ్య కుంపట్లు పెట్టి చలికాచుకుంటూ భూముల తన ప్రమాదకరమైన రాజకీయ ప్రస్థానాన్ని జనంలో ఎప్పటికీ నానుతూ ఉండేలా కొనసాగాలని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
టిటిడి చైర్మన్ గా రెండుసార్లు, బోర్డు సభ్యుడిగా మరికొన్నిసార్లు అపరిమితమైన అధికారాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతకుముందు రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ అనుభవించిన భూమన కరుణాకర్ రెడ్డి తాను ధార్మిక సంస్థలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయన చైర్మన్ గా పని చేసిన సమయంలో అప్పటి టీటీడీ ముఖ్య గణాంక అధికారిణి ( F&CAO ) గా పనిచేసిన ఒక మహిళ ఉన్నతాధికారిణి తో కలిసి చాలా సన్నిహితంగా మెలిగారు.. అది ఎంతలా అంటే..? కుటుంబ సభ్యులతో కంటే ఇంకా చనువుగా శ్రీవారి గర్భాలయంలో ఇద్దరూ కలిసి ప్రతిరోజు గంటల సమయం స్వామి ఎదుటే కూర్చుండిపోయేవారు. ఇది ఆలయ అధికారులతో సహా లక్షలాదిమంది భక్తులు కూడా స్వయంగా చూసిందే. అయినా అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్నవారు కాబట్టి అందులోనూ ఆయనతో పాటు ఉన్న మహిళ ఉన్నతస్థాయి అధికారిణి కాబట్టి ఎవరు నోరు మెదపలేకపోయారు. సామాన్య భక్తులకు క్షణకాలం దర్శనం దుర్లభం అయినప్పటికీ గంటల తరబడి భూమన ఆ మహిళతో కలిసి ఆలయంలోనే కూర్చుండిపోయినా కూడా కనీసం వారించలేకపోయారు. కానీ అప్పట్లో ప్రతి ఒక్కరూ వారిద్దరి చనువు సన్నిహితంగా మెలిగిన పరిస్థితులు చూసి విపరీతంగా చెవులు కొరుక్కున్నారు.
అంతెందుకు ఇంతకాలం తిరుపతి మేయర్ గా పని చేసిన యాదవ కులానికి చెందిన ఒక మహిళ డాక్టర్ ను పార్టీ కార్యక్రమాల పేరుతో నిరంతరం తన వెంటే తిప్పుకొని కనీసం మేయర్ గా ఆమెకున్న గౌరవాన్ని కూడా దక్కనివ్వకుండా ఇతరులు వారి సాన్నిహిత్యం గురించి తప్పుగా భావించుకునేలాగా అతిగా వ్యవహరించిన పరిస్థితి భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహార శైలిదే అనే విషయం తిరుపతి వాసులందరికీ బహిరంగ రహస్యమే. అందుకే తాను చేస్తే శృంగారం ఇంకొకరు చేస్తే వ్యభిచారం అనే ధోరణిలో భూమన వ్యవహరిస్తున్నారని అందరూ అంటున్నారు.
కల్తీ నెయ్యి వ్యవహారంతో, మతపరమైన కుట్రలతో రాష్ట్రస్థాయిలో పరువు పోగొట్టుకున్న వైసిపి, టీటీడీలో కోట్ల రూపాయల కుంభకోణాలతో మరింత ప్రమాదకరమైన మత రాజకీయాన్ని తెరమీదకి తీసుకొచ్చి నిరంతరం బిఆర్ నాయుడు పై మార్ఫింగ్ వీడియోలతో జనాన్ని తప్పుదోవ పట్టించిన భూమన.. అసలు రాజకీయాలను ఉండే వైదొలుగుతున్నట్లు గతంలో ప్రకటించిన భూమన... తాను చెబుతున్నది ఒకటి చేస్తున్నది మరొకటి.. ఇప్పటికే తన వ్యవహార శైలితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ప్రయోజనం కలుగకపోగా ఎంతో నష్టం కలిగించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.