చంద్రబాబు ఉదాసీనత... టిటిడి పై అప్రతిష్ట... బి ఆర్ నాయుడు ని టార్గెట్ చేసిన భూమన

చంద్రబాబు ఉదాసీనత... టిటిడి పై అప్రతిష్ట... బి ఆర్ నాయుడు ని టార్గెట్ చేసిన భూమన

చంద్రబాబు ఉదాసీనత.. టీటీడీపై అప్రతిష్ట....

 వైసిపి ఆకృత్యాలతో తిరుపతిలో అలజడులు

 విచ్చలవిడిగా గంజాయి.. అదుపు తప్పుతున్న పరిస్థితి..

 శిశుపాలుడిలా 100 తప్పులు దాటినా చర్యలు ఎక్కడ?

 కల్తీ నెయ్యి, పరకామణి సెటిల్మెంట్, శాలువాల కుంభకోణం, శ్లోకాలు లేని భగవద్గీత, 4 కోట్ల అవినీతి, టీటీడీ కాంట్రాక్టులలో ప్రతి పనిలోనూ 15% కమిషన్, ఏ ఫైలు ముట్టుకున్నా అవినీతి కంపు 

వైసీపీ అక్రమాలను బయటపెడుతున్నందుకు 

 బి.ఆర్ నాయుడు ని టార్గెట్ చేసిన భూమన 

 టిటిడిలోనూ పెరిగిన ప్రభుత్వ పెత్తనం.. పేరుకే పాలకమండలి... తీర్మానాల అమలుకూ దిక్కులేదు...

 కోలా లక్ష్మీపతి / ఎడిటర్ / మాయావి న్యూస్:

  తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదు.. టీటీడీలో రాజకీయాలు సహించను.. వెంకటేశ్వర స్వామి నా కుల దైవం.. అలిపిరిలో బాంబు దాడితో నాకు స్వామివారే పునర్జన్మను ప్రసాదించారు... రాష్ట్రవ్యాప్తంగా ప్రక్షాళన చేపడతా.. అది తిరుమల నుంచే మొదలు పెడతా... ధార్మిక సంస్థలో వైసిపి సానుభూతిపరులను దూరంగా తరిమేస్తా... తిరుపతిలో గుండాయిజాన్ని సమూలంగా నిర్మూలిస్తా.... ప్రజల హర్షద్వనాల మధ్య ఈ మాటలు అన్నది ఎవరో కాదు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలోనే.... అయితే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దగ్గర పడుతున్నప్పటికీ ఆయన ఈ మాటలేవీ ఇప్పుడు పట్టించుకోవట్లేదు.

 కేవలం అభివృద్ధి, పెట్టుబడుల మంత్రం జపిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేసి పెట్టిన వైసీపీ విధానాలను ఈనాటికి కొనసాగిస్తూ... వైసీపీలో జగన్ తో అంట కాగిన అధికారులనే తన చుట్టూ కోటగిరిగా నిర్మించుకుంటూ... తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నప్పటికీ వైసీపీ నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా... కేవలం వారి తప్పులను ప్రజల ఎదుట ఎత్తి చూపించడమే తన బాధ్యత అన్న విధంగా... విచ్చలవిడిగా వాగుతున్న వారిని విచ్చలవిడిగా వదిలేయడంతో ఇప్పుడు రాష్ట్రంలో అధికారం పేరుకి కూటమిదే అయినా అంతా వైసిపి వారు అనుకుంటున్నట్లుగానే మైండ్ గేమ్ రాజకీయం లక్షణంగా సాగుతోంది. 

 రాష్ట్రంలో ఎక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేయకుండా కేవలం స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నప్పటికీ అందుకు భిన్నంగా తిరుపతి లో మాత్రం వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి తన సొంత అజెండాతో నిరంతరం టిటిడి పై బురదజల్లే కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నారు. తాను టీటీడీ చైర్మన్గా రెండుసార్లు పనిచేసినప్పటికీ టిటిడిలో రాజకీయాలు చేయకూడదనే కనీస సాంప్రదాయాన్ని కూడా ఆయన పాటించకుండా టీటీడీ నే టార్గెట్ చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం వస్తుందనే దురాశతో రోజుకో రకమైన ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా కంకణం కట్టుకున్నారు. అంతేకాదు.. ఎవరిని అంత తొందరగా నమ్మని చంద్రబాబు ఏరి కోరి మీడియా రంగంలో ముక్కు సూటిగా నిజాయితీగల వ్యక్తిగా పేరు తెచ్చుకున్న బిఆర్ నాయుడుని టిటిడి చైర్మన్ గా నియమించారు. బి ఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే అంతకు మునుపు ఐదేళ్లపాటు టిటిడిని పరిపాలించిన వై వి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీరి వెనక ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అక్రమాలను అవినీతిని మతపరమైన విధ్వంశాన్ని ఒక్కొక్కటిగా వెలికి తీయడం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం చేశారు. 

 ఈ క్రమంలోనే పవిత్రమైన శ్రీవారి లడ్డూల తయారీలో నెయ్యి కానీ కల్తీనెయ్యిని వాడి దాని వెనుక పెద్ద ముఠాని ఏర్పరిచి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి చారిత్రాత్మకమైన తప్పిదాన్ని చేసిన వైసిపి బాగోతాన్ని తొలుతగా బిఆర్ నాయుడు బయటపెట్టారు. 

 భక్తులు వేసి కానుకలను లెక్కించే చిరు ఉద్యోగి అయిన రవికుమార్ అనే వ్యక్తి ఏళ్ల తరబడి స్వామివారిని సొమ్మును దొంగతనం చేసి దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టారు. అంతటి నేరస్తుడితో వైసిపి నేతలు అప్పుడు చైర్మన్లుగా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అప్పటి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, మరో ఐపిఎస్ అధికారి పరమేశ్వర్ రెడ్డి అంతా కుమ్ముక్కై నామమాత్రంగా కొంత ఆస్తిని టీటీడీకి రాయించుకుని మిగిలిన కోట్లాది రూపాయల ఆస్తులను తమ బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న ఘనకార్యాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. 

 అంతేనా తవ్విన కొద్దీ బయటపడుతున్న అక్రమాలు అన్ని ఇన్ని కాదు.. వీఐపీలకు కప్పే సాలువాలను కూడా పట్టు వస్త్రాల పేరుతో రూ,200 కూడా చేయని వాటిని 1350 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి కొన్ని కోట్ల రూపాయలను కమిషన్లుగా బొక్కేసి దేవుడు సొమ్ము దిగమిగారు.

 చివరకు టీటీడీ సొమ్ము ఐదు కోట్ల రూపాయల ఖర్చు చేసి 50 లక్షల రూపాయల విలువ చేయని భగవద్గీత పుస్తకాలను 15 పేజీల చొప్పున ప్రచురించారు. భగవద్గీత అంటే కనీసం అందులో ఒక శ్లోకం కూడా లేకుండా కేవలం అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ల తొలి పలుకులు పేరుతో సొంత డబ్బా కొట్టుకుని దాన్ని భగవద్గీత పేరుతో భక్తుల కు అందజేయాలని చూశారు. తీరా ఆ పుస్తకాలు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా గోడౌన్లో పడి ఉన్నాయి. ఇలా ఏ ఫైలు ముట్టుకున్నా 15% కమిషన్లు తీసుకుని కమిషన్ రెడ్డిగా పేరుగాంచిన వైసీపీ నేత అవినీతి అక్రమాలు కంపు కొడుతున్నాయి. 

 ఈ అక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్న కారణంగానే ఇక బి.ఆర్ నాయుడు ఈ టీటీడీ చైర్మన్ పదవిలో తనకి ముప్పు తప్పదని గ్రహించిన భూమన తొలి నుంచే ఆదిలోనే హంసపాదులా చైర్మన్ పదవికి బి ఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ ప్రతిరోజు పాటలాగా మొదలుపెట్టారు. అది కుదరకపోయేటప్పటికి బి ఆర్ నాయుడు కి సంబంధించిన వ్యక్తిగత అంశాలకు సంబంధించిన ఎప్పుడో టీటీడీ చైర్మన్ కాక మునుపు దశాబ్ద కాలం క్రితం హైదరాబాదులో జరిగిన ఒక చిన్న వీడియోను మార్ఫింగ్ చేసి, ఏమీ లేని అందులో అసభ్యతను ఆపాదించి జనాల్లో ఏదో జరిగిపోతుందనే దుష్ప్రచారాన్ని చేశారు. 

 అయితే ఈ ప్రచారం బెడిసి కొట్టేటప్పటికీ టీటీడీ ఎడి బిల్డింగ్ వద్ద టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేస్తుంటే అక్కడ విధి నిర్వహణలో ఉన్న టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది కూడా నిలువరించకుండా పోయారంటే భూమనకు కోవర్టులు టీటీడీలో ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తిరుమలకు రావడానికి టిటిడి చైర్మన్ తిరుపతిలోని హోటల్ కి చేరుకోగానే వైసిపి కార్యకర్తల పేరుతో కొంతమంది ప్లకార్డులు పట్టుకొని హోటల్ లోపలికి ప్రవేశించి టీటీడీ చైర్మన్ గా రాజీనామా చేయాలంటూ ఏకంగా బిఆర్ నాయుడు పై దాడి చేయడానికి ప్రయత్నించారు. 

 సమయానికి టీటీడీ చైర్మన్ ను కలవడానికి అక్కడకు వచ్చిన టిడిపి నేత జె బి శ్రీనివాస్ తన కార్యకర్తలతో కలిసి వైసిపి దాడిని అడ్డుకున్నారు. 

 అప్పటివరకు పరోక్షంగా వైసిపి కే సహకరిస్తున్నట్టుగా నటించిన పోలీసులు ఇక తప్పదు అన్నట్లుగా అక్కడ అందరినీ అదుపులోకి తీసుకుని పదిమంది వైసిపి కార్యకర్తలపై నలుగురు తెలుగుదేశం కార్యకర్తలపై పరస్పర దాడుల పేరుతో కేసులు నమోదు చేశారు. ఇదే పోలీసులు గత వైసిపి ప్రభుత్వ హయాంలో జనసేన నేతలు గాని తెలుగుదేశం పార్టీ నేతలు కానీ చిన్న స్టేట్మెంట్ ఇస్తే చాలు వెంటనే వారు ఎక్కడున్నారో వీటికి పట్టుకొని మరీ అరెస్టు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి చీర సారా పెడుతున్నామంటూ జనసేన వీరమహిళలు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిరసన తెలియజేస్తుంటే దాన్ని అడ్డుకొని అర్ధరాత్రి 12 గంటలకు వరకు పోలీసులు వాళ్ళని వారిని నిర్బంధించారు. మరో జనసేన నేత కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తే చాలు మాట్లాడనీయకుండానే పోలీసులు అరెస్టు చేసేవారు. మరి ఇప్పుడు ఇంత అలజడులు సృష్టిస్తున్న వైసిపి నాయకుల పట్ల పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నట్లో అర్థం కాదు. 

 తిరుపతి నగరంలో యువత అంతా పెడదారి పట్టి గంజాయి వాడకాన్ని విచ్చలవిడిగా చేస్తుంటే.. యువత వైసిపి పంచన చేరి గుండాయిజాన్ని చేస్తూ తిరుపతి నగరానికి ప్రమాదకరంగా తయారవుతుంటే.. వారినంతా ఇలా తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసం భూమన వాడుకుంటూ.. తిరుపతి నగరానికి ఒక ప్రమాదకరమైన రాజకీయ కక్షపూరిత వాతావరణాన్ని పరిచయం చేస్తుంటే ప్రభుత్వం కళ్లు మూసుకొని నిద్రపోతోందా...??? లేక దాని మీద అది చేస్తాం ఇది చేస్తాం చర్యలు తీసుకుంటాం.. అంటూ రాజకీయ స్టేట్మెంట్లు తప్ప చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తోంది అనేది సందేహాస్పదంగా మారింది. 

 సరిగ్గా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా ఉదాసీనత గా పరిపాలన సాగిస్తున్నారో... సరిగ్గా అదే ఉదాసీనత చేతకాని ప్రభుత్వ పాలన అనే విధంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అభిప్రాయం బలపడుతోంది. 

 బి.ఆర్ నాయుడు పై కక్షకట్టుకుని భూమన ప్రమాదకరమైన రాజకీయం చేస్తుంటే.. అందుకు తగిన విధంగా ప్రభుత్వం బిఆర్ నాయుడు ఆధ్వర్యంలోని పాలకమండలికి సహకారం అందించకుండా... "తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి" అనే విధంగా పాలకమండలి నిర్ణయాలు అమలు చేయకుండా అధికారులు దాన్ని అడ్డుకొని ప్రభుత్వానికి పాలకమండలి పైనే రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇస్తూ ఆధిపత్యం నిలబెట్టుకునేలా ఉన్నతాధికారులే వ్యవహరిస్తుండడం టీటీడీలో ఒక విధమైన అయోమయమైన పరిస్థితి తయారయింది. 

 పాలకమండలి అటు అధికార వ్యవస్థ రెండు వర్గాలు ప్రభుత్వానికి అందిస్తున్న టీటీడీలోని పరిస్థితుల ఫీడ్బ్యాక్ ను ప్రభుత్వ పెద్దలు టిటిడి పై పెతనం చలాయించాలని వాడుకుంటున్నారు. ఫలితంగా టిటిడి పాలక మండల తీసుకుంటున్న అనేక నిర్ణయాలు తీర్మానాలుగానే మిగిలిపోతున్నాయి. ఉదాహరణకు టిటిడిలో వైసీపీకి అంట కాగుతున్నారని డిప్యూటీవో స్థాయి అధికారులను బదిలీలు చేస్తూ అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పాలకమండలి ప్రమేయం ఏమాత్రం లేకపోయినప్పటికీ 8 మంది డిప్యూటీ ఈవో అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా స్వయంగా నారా లోకేష్ టిటిడిఈఓ కు సిఫార్సు చేశారు. ఆ మేరకు బదిలీలు చేసిన ఆదేశాలను తిరుమలలోని మరో ఉన్నతాధికారి అడ్డుకట్ట వేశారు. ప్రభుత్వానికి ఈ విషయంలో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కీలక స్థానాల్లో ఉన్న వైసిపి సానుభూతిపరులైన అధికారులను బదిలీ చేస్తే.. అందుకు విరుద్ధంగా ఇప్పుడు నియమిస్తున్న అధికారులు అందరూ వైసీపీకి సానుభూతిపరులే అంటూ ప్రభుత్వానికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో ఆ అధికారి సఫలీకృతులయ్యారు.  

 ఇలా అనేక అంశాలలో పాలకమండలి తీసుకున్న తీర్మానాలను కూడా ఉన్నతాధికారులు అమలు చేయకుండా అందులో ప్రభుత్వం నుండి తమకు మాత్రమే పేరు రావాలి పాలకమండలి నామమాత్రంగానే ఉండాలి అని ధోరణిలో తెరవెనుక రాజకీయాన్ని నడుపుతున్నారు. 

 నిరంతరం విమర్శలతో ఆరోపణలతో విఆర్ నాయుడు పై విషం కక్కుతున్న వైసిపి నేతలను 100 తప్పులు వెంటాడుతున్నప్పటికీ ఒక్క తప్పుపై కూడా ప్రభుత్వం చర్య తీసుకోకుండా కాలయాపన చేస్తుండడం టిటిడి కి ఇబ్బందికరంగా మారింది. అంతేకాదు మనం ఏం చేసినా ప్రభుత్వం ఏమి చేయలేకపోతోంది చేతకాని ప్రభుత్వం అంటూ వైసీపీ మరింత రెచ్చిపోతూ ప్రభుత్వానికి సవాలు విసురుతోంది. గత వైసిపి ప్రభుత్వం హయాంలో నోరు తెరిచి మాట్లాడిన వారందరి పైన కేసులు పెట్టించి నానా ఇబ్బందులకు పడిన కూటమి ప్రభుత్వ కార్యకర్తలు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా మళ్లీ యధావిధిగా వైసీపీ నేతల ధోరణితో ఇలా కష్టాలు పడాలంటే ఎవరికి ఓపిక ఉంటుంది చంద్రబాబు గుర్తిస్తారా లేదా లోకేష్ బాబు పట్టించుకుంటారా లేదా అంటూ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.