తిరుమల ఆన్లైన్ టికెట్స్ నేడు రిలీజ్

*🛕 తిరుమల తిరుపతి దేవస్థానం – మే నెల దర్శన టికెట్ల విడుదల.* 

నేడు తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన మే నెల టికెట్లు నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

🕙 విడుదల సమయాలు:

ఉదయం 10 గంటలకు – అంగప్రదక్షిణ టికెట్లు విడుదల

ఉదయం 11 గంటలకు – శ్రీవాణి దర్శన టికెట్లు రిలీజ్

మధ్యాహ్నం 3 గంటలకు – వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల

భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నందున, ముందుగానే లాగిన్ అయి అవసరమైన వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.