బి ఆర్ నాయుడు పై అసత్య పోస్టులు పెడుతున్న సయ్యద్ అరెస్ట్
టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బాపట్లకు చెందిన వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త షేక్ సయ్యద్ అరెస్ట్..!
జెట్టి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు సయ్యద్ ను అరెస్టు చేసిన తెనాలి రూరల్ పోలీసులు!!
గుంటూరు జిల్లా తెనాలి.. మాయావి న్యూస్ :
టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యవహారంలో సోషల్ మీడియాలో అసభ్యకర అసత్య పోస్టులు పెడుతున్న బాపట్ల కు చెందిన వైసిపి కార్యకర్త షేక్ సయ్యద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అంగలకుదురుకు చెందిన టిడిపి నాయకురాలు జెట్టి రేణుక పై అసభ్యకర అసత్య పోస్టులు పెట్టిన షేక్ సయ్యద్ పోలీసుల చేతికి చిక్కాడు.
జెట్టి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు సయ్యద్ ను అరెస్టు చేసిన తెనాలి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జెట్టి రేణుక ఫోటోని అసభ్యకరంగా పోస్ట్ చేసిన బాపట్ల షేక్ సయ్యద్.. వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పర్యవేక్షిస్తూ కార్యకర్త గా ఉన్న సయ్యద్ వైసిపి పక్కా ప్రణాళిక మేరకు అమలు చేస్తున్న విషయాన్ని బయట పెట్టిన పోలీసులు.
అతడిని అరెస్ట్ చెయ్యటం జరిగిందన్న రూరల్ సీఐ నాయబ్ రసూల్
2024 సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి అనిత మీద పోస్టులు పెట్టటంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 8 పోలిస్ స్టేషన్ లలో 8 కేసులు నమోదు...ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి
చింతలపూడి, బాపట్ల టౌన్, కొత్త పట్నం,పులివెందుల, విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, అన్నిట్లో కేసులు ఉన్న అతను ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకుండా పోస్టులు పెడుతున్నాడు
టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న జెట్టు రేణుక నీ అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ నాయుడు కి లింక్ చేస్తూ జట్టు రేణుక ఉన్న కారు ఫోటోని అప్లోడ్ చేయడంతో దాన్ని పలువురు షేర్ చేయడం జరిగింది
జెట్టు రేణుక ఫిర్యాదు చేశారని తెలియటంతో అతను పారిపోతున్న క్రమంలో నందివెలుగు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జ్ 14 రోజులు రిమాండ్ విధించడం జరిగిందని వెల్లడించారు.
మహిళల గురించి గానీ అసభ్యకరంగా సోషల్ మీడియాలో మాట్లాడిన పోస్ట్లు పెట్టిన ఫోటోలు ఎడిట్ చేసిన ఉపేక్షించబోమని రౌడీ షీటర్ లో ఓపెన్ చేస్తామని కఠినంగా వ్యవహరిస్తామని గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరపున హెచ్చరిస్తున్నామని చెప్పిన సిఐ.