సాయంత్రం వరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లోనే కూర్చుంటా.. దమ్ముంటే రండి.. భూమన కరుణాకర్ రెడ్డికి, మాజీ మంత్రి రోజా కి ఓ రేంజ్ లో సవాల్ విసిరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి

సాయంత్రం వరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లోనే కూర్చుంటా.. దమ్ముంటే రండి.. భూమన  కరుణాకర్ రెడ్డికి, మాజీ మంత్రి రోజా కి ఓ రేంజ్ లో సవాల్ విసిరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి  ఆకేపాటి సుభాషిణి

ఉదయం నుండి సాయంత్రం వరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లోనే కూర్చుంటా... దమ్ముంటే రండి.. ఏం చేస్తారో చూస్తా...

టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి, మాజీ మంత్రి రోజా కి ఓ రేంజ్ లో సవాల్ విసిరిన..

 జనసేన పార్టీ రాష్ట్ర వీర మహిళ కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి 

 తిరుపతి మార్చ్ 22 మాయావి న్యూస్ 

 జనసేన పార్టీ వీర మహిళ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లొ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్కే రోజా మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చానని, దానికి భూమన కరుణాకర్ రెడ్డి వద్ద వందకు,500 కి, బిరియాని ప్యాకెట్ల కోసం తాపత్రయ పడే పేటీఎం బ్యాచ్ దగ్గర సోషల్ మీడియాలో నా పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తూ, ట్రోల్స్ చేస్తున్నారని అలాంటి వాటికీ నేను భయపడే దాన్ని కాదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే ఒక్కొక్కరికి తాట తీస్తానని హెచ్చరించారు.నేను జనసేన పార్టీలో నీతి, నిజాయితీ,నిబద్దతతో, పనిచేస్తున్నానని పేర్కొన్నారు.కరుణాకర్ రెడ్డి పక్కన ఇలాంటి వ్యక్తులు ఉండటం వలన,గత ఎలక్షన్లో 60 వేల మెజార్టీ వచ్చిందని, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో లచ్చ మెజార్టీ వస్తుందని, ఇలాంటి వ్యక్తులు కరుణాకర్ రెడ్డి పక్కన ఉండటం మాకు మంచిదే అని చెప్పారు.నా కొడుకు పెళ్లి సంగీత్ లో నేను డాన్స్ వేయకుంటే వచ్చి జగన్మోహన్ రెడ్డి,భారతి రెడ్డి, వచ్చి డాన్స్ వేస్తారా? అని ప్రశ్నించారు.నాకు దగ్గర బంధువుల పెళ్లిళ్లకు,ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ఉత్సాహంలో డాన్స్ వేస్తారని, దానికి లేనిపోని అర్థాలు తీస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరని పేర్కొన్నారు.మీరు ఒప్పించి తీసుకొస్తే మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తో డాన్స్ వేయడానికి కూడా నేను సిద్ధమే!అన్నారు.నా కొడుకు పెళ్లిలో నేను డాన్స్ చేయక భూమన కరుణాకర్ రెడ్డి,కొడుకు అభినయ రెడ్డి వచ్చి డాన్స్ వేస్తారా?అన్నారు. మేము పవన్ కళ్యాణ్ ఆశయాలతో రాజకీయాలలోకి వచ్చామని, చంపుతాం,పొడుస్తామంటే, భయపడే వ్యక్తులు కాదని అన్నారు. మీ ఇండ్లలో ఉండే వాళ్లు మాత్రమే ఆడవాళ్లా? మా ఇండ్లలో ఉండే వాళ్లు ఆడవాళ్లు కాదా? అని పేర్కొన్నారు.మా వాళ్ల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.ఈ సమావేశంలో మలిశెట్టి లక్ష్మీ, చందన,దుర్గా,శాంతి,శిరీష, తదితరులు పాల్గొన్నారు.