అర్ధరాత్రి అయినా పోలీస్ స్టేషన్ కు రావాల్సిందే.... జనసేన వీర మహిళ పట్ల తిరుపతి వెస్ట్ పోలీసులు అనుచిత వైఖరి

అర్ధరాత్రి అయినా పోలీస్ స్టేషన్ కు రావాల్సిందే.... జనసేన వీర మహిళ పట్ల తిరుపతి వెస్ట్ పోలీసులు అనుచిత  వైఖరి

అర్ధరాత్రి అయినా స్టేషన్ కి రావాల్సిందే..!?

 ఒక వ్యక్తి మరో మహిళను జుట్టు పట్టుకొని కొట్టినా కళ్ళప్పగించి చూసిన పోలీసులు 

జనసేన వీర మహిళ పట్ల తిరుపతి వెస్ట్ పోలీసుల అనుచిత వైఖరి 

 తిరుపతి మార్చ్ 28 మాయావి న్యూస్ 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయంగా హోం మంత్రి ఒక మహిళ అయినప్పటికీ మహిళలకే పోలీసులు న్యాయం చేయలేకపోగా వారిని మరింత ఇబ్బందులు పెడుతుండడం పోలీసులు పట్ల విశ్వసనీయతను దిగజారేలా చేస్తోంది. తిరుపతిలో వెస్ట్ పోలీసులు స్వయంగా ఒక జనసేన వీర మహిళ పట్ల ప్రవర్తించిన తీరు పోలీసులపై నమ్మకం కోల్పోయేలా ఉంది.  

 స్థానిక రాజన్న పార్కు సమీపంలో నివాసముంటున్న జనసేన వీర మహిళ ఇంటికి గురువారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు వచ్చి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు స్టేషన్ కి రండి విచారించాలి అంటూ బెదిరించారు. దీంతో ఆ జనసేన వీర మహిళ ఇంత రాత్రివేళ పిలవడం కరెక్ట్ కాదంటూ రేపు ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పారు. అయితే వచ్చిన కానిస్టేబుల్ ఆ మహిళ పట్ల మరింత దురుసుగా ప్రవర్తిస్తూ... ఎంత రాత్రి అయితే ఏం... అర్ధరాత్రి అయినా సరే మేం పిలిస్తే స్టేషన్ కి రావాల్సిందే అంటూ... అమర్యాదగా మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల అందరూ చూసేలా అవమానంగా మాట్లాడారు. దీంతో ఆ జనసేన వీర మహిళ జనసేన నగర నాయకులకు ఫోన్ చేసి తనకు జరుగుతున్న అవమానాన్ని వివరించింది. 

 జనసేన నాయకులు సంబంధిత కానిస్టేబుల్ తో మాట్లాడతాము ఫోన్ ఇవ్వమని చెప్పగా కనీసం ఆ ఫోన్ తీసుకొని సంబంధిత నాయకులతో జనసేన అయితే ఏమీ ఎవరైతే ఏమి మాకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా ఆ మహిళకు సంబంధించిన ఫోనును కానిస్టేబుల్ బలవంతంగా లాక్కొని తీసుకెళ్లబోయాడు. 

 ఇక లాభం లేదను ఎవరు చెప్పినా వినకపోవడంతో ఆ వీర మహిళ అంత రాత్రి సమయంలోనే పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. తీరా అక్కడ విషయం పరిశీలిస్తే ఒక చిన్న పిల్లవాడికి సంబంధించిన చిన్న గొడవ కారణంగా ఒక వ్యక్తి స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అది కూడా సంబంధిత జనసేన వీర మహిళ అక్కకు సంబంధించిన కుమారుడిని చిన్నపిల్లవాడని కూడా చూడకుండా కొట్టి పైగా మళ్లీ వాళ్లే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన నిజా నిజాలు నిర్ధారించుకోకుండా పోలీసులకు ఎంత మామూళ్లు ముట్టిందో తెలియదు గానీ... అదేదో అంతర్జాతీయ సమస్య అన్నట్లుగా అప్పటికప్పుడే జనసేన వీర మహిళను అర్ధరాత్రి అని కూడా చూడకుండా తీసుకెళ్లి సెల్ లో వేస్తామంటూ బెదిరించారు.  

 పోలీసుల అలుసు చూసుకుని ఫిర్యాదు చేసిన వ్యక్తి సాక్షాత్తు పోలీసుల కళ్ళు ఎదుటే మరింతగా రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా సంబంధిత వ్యక్తి జనసేన వీర మహిళపై జుట్టు పట్టుకుని మరి రక్త గాయాలు అయ్యేలా కొట్టాడు. 

 తాను ఒక జనసేన వీర మహిళ గా ఉండి ఎన్నో మహిళా సమస్యలపై పోరాడి ఉన్నప్పటికీ ఇలా జరుగుతున్న వైఖరి పై హఠాత్ పరిణామాలకు విస్తు పోయింది. ఆ మహిళకు మద్దతుగా తిరుపతి జనసేన నాయకులు అందరూ పోలీస్ స్టేషన్కు చేరుకుని మాట్లాడినప్పటికీ మామూలు తీసుకున్న పోలీసులు అంత తొందరగా మారిపోతారా..? జరగదు కదా...! తీరా సగం రాలిన జుట్టుతో ఇబ్బందికరమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన జనసేన వీర మహిళ ఆమె సోదరి తరఫున అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

 అయితే ఈ ఫిర్యాదు గురించి పోలీసులు పట్టించుకోకపోగా మూడు రోజులుగా ఇంకా సంప్రదింపులతోనే ఫిర్యాదుదారులతో పెద్దమనుషుల తరహాలో మద్యస్థాలు చేసుకుంటూ కాలం వెలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా స్వయంగా తిరుపతిలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ కనీసం పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ కార్యకర్తకు విలువ దక్కడం లేదంటే పరిపాలన దుస్థితి పోలీసుల వైఖరి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు.