చిత్తూరును అభివృద్ధి పథంలో నడిపిస్తా.. ఎంపీ దగ్గు మళ్ల ప్రసాదరావు

చిత్తూరును అభివృద్ధి పథంలో నడిపిస్తా.. ఎంపీ దగ్గు మళ్ల ప్రసాదరావు

చిత్తూరు పార్లమెంటును అభివృద్ధి పదంలో నిలుపుతా

ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు 

 చిత్తూరు మార్చి 22 మాయావి న్యూస్ 

చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో సమాన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలోచెప్పారు.

గడిచిన రెండేళ్ల కాలంలో చిత్తూరు ప్రాతినిధ్య ఎంపీగా పాకాల-కాట్పాడి డబ్లింగ్ రైల్వే లైన్ పనుల కోసం కృషి చేస్తూ డిపిఆర్లు తీసుకువచ్చి పనులు ప్రారంభమై త్వరలోనే అందుబాటులోకి డబ్బింగ్ రైల్వే లైన్ రానుందన్నారు. అలానే ఎంతో కీలకమైన రైల్వే షెడ్డు చిత్తూరులో డిపిఆర్ దశ నుండి పనులు ప్రారంభమయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహింపబడుతున్న కేంద్రీయ విద్యాలయాలను చిత్తూరు నియోజకవర్గానికి తీసుకురావడం, దేశవ్యాప్తంగా14 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు అనుమతులు వస్తే అందులో కుప్పం, చిత్తూరు, మదనపల్లిలో మూడు కేంద్రీయ విద్యాలయాలను తీసుకువచ్చామన్నారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో 75 శాతం ఆయా గ్రామాల ప్రజలకు ఉపయోగపడే ప్రధాన రోడ్లు,అనుసంధాన రోడ్లు నరేగా నిధులతో,15వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తి చేసామన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయం లో భాగంగా ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో 60 మంది ఫెసిలిటేటర్స్ ను ఏర్పాటు చేసి నిరుద్యోగ శాతాన్ని తగ్గిస్తూ స్వయం ఉపాధిని పెంపొందించుకునే విధంగా ఎంఎస్ఎంఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ 1600 మందిని అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మామిడి రైతులకు గిట్టుబాటు ధరతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సహకార నిధులను కూడా రైతులకు అందించామన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కుప్పం వరకు ఇప్పటికే నీరు చేరిందని, దీని ద్వారా కాలువకుండా ఉండే గ్రామాలలో చెరువులు నిండుతూ భూగర్భ జలాలను పెంపొందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, విలేజ్ క్లినిక్లను అభివృద్ధి చేసుకోవడానికి, వసతులు మెరుగుపరచుకోవడానికి దాదాపుగా రూ.65 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయించామన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ చార్జీల భారాల నుండి ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా వేల ఇళ్లకు సౌర శక్తిని అందించే విధంగా చర్యలు తీసుకొని, ఇండ్లకు సబ్సిడీ ఇస్తున్నామన్నారు.హౌసింగ్ స్కీమ్ ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని తీసుకువస్తూ, రెవెన్యూ విభాగానికి సంబంధించి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేసేలా కృషి చేస్తానని అన్నారు. రాబోయే రోజులలో చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలను పరిశీలించి ఆయా ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని అయన స్పష్టం చేశారు.