హతి రాంజీ మఠం మహంతుగా మళ్లీ అర్జున్ దాస్..? గత వైసిపి ప్రభుత్వ ఆదేశాలను తప్పు పట్టిన సుప్రీం కోర్టు.

హధీరాంజీ మఠం మహంతుగా మళ్లీ అర్జున్ దాస్..!?

 సుప్రీంకోర్టులో అనుకూల ఆదేశాలు...

 తిరుమల, మార్చి 9 మాయావి న్యూస్ : 

 వందల కోట్ల రూపాయల హధిరాంజీ మఠానికి సంబంధించిన ఆస్తులను అమ్మకాలకు పెట్టేసి, అనేకమంది బడా రాజకీయవేత్తలను కోటీశ్వరులను చేసి మఠానికి సంబంధించిన ఆస్తులను దుర్వినియోగపరిచారని సంచలనాత్మకమైన ఆరోపణలు ఎదుర్కొంటూ సుదీర్ఘకాలం మహంతుగా కొనసాగిన అర్జున్ దాస్ స్వామి అనేక వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొని ఒక మహిళ కేసులో డేరా బాబాగా విమర్శలు భరించిన, 

హతి రాంజీ మఠం మాజీ మహంత్ అర్జున్ దాస్ కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 

 కొన్ని దశాబ్దాల పాటు హతీరాంజీ మఠం ఆస్తులకు సంరక్షకుడిగా వ్యవహరిస్తూ మహంతుగా కొనసాగిన అర్జున్ దాస్ ను మఠానికి చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను కారు చౌకగా కొంతమంది పెద్దలకు కట్టబెట్టారని, 

అనేక ఆరోపణల నేపథ్యంలో 

 గత వైసిపి ప్రభుత్వ హయాంలో అర్జున్ దాస్ ను మఠం మహంతిగా తొలగిస్తూ అప్పటి దేవాదాయ శాఖ ఆధీనంలోని ధార్మిక పరిషత్ ఆదేశాలు ఇచ్చింది. 

 దీనిపై తనకు అసలు ఆస్తులను అమ్మే అధికారమే ప్రభుత్వం ఇవ్వలేదంటూ... మహంతుగా తనకున్న అధికారాలు చాలా పరిమితం అని... అప్పటి దేవాదాయ శాఖ చేసిన ఆరోపణలు అన్ని అబూత కల్పనలు అని.. వైసిపి ప్రభుత్వం తనను మహంతుగా తొలగించడానికి సవాల్ చేస్తూ అర్జున్ దాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఆరోపించిన విధంగా తాను మఠానికి సంబంధించిన ఆస్తులను ఎవరికి అక్రమ మార్గంలో అమ్మకాలు జరపలేదని ఆయన వాదించారు. అసలు ఆస్తులను అమ్మే అధికారమే తనకు లేదని అలాంటప్పుడు ప్రభుత్వం వాదించిన అంశంపై వాస్తవం లేదని ఆయన కోర్టుకు విన్నవించారు. అర్జున్ దాస్ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అప్పటి వైసిపి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను తిరిగి పరిశీలించాలని సూచించింది. అంతేకాకుండా ఆస్తులను అక్రమంగా కట్టబెట్టినట్టు ఆరోపణలు రుజువు కానందున అర్జున్ దాస్ ను తిరిగి హాతిరాంజీ మఠం మొహంతుగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు 19343/2026 పేరిట ఆదేశాన్ని జారీ చేసింది. దీనిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలించి తిరిగి అర్జున్ దాస్ ను హతిరాంజీ మఠం మహంతుగా నియమించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.